అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరాలయ (Prasanna Venkateswara Temple) వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా వేంకటేశ్వర స్వామి కల్యాణం శుక్రవారం వైభవంగా జరిపించారు. భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి కల్యాణోత్సవాన్ని తిలకించారు. స్వామివారి కల్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి (MLA Katipally Venkata Ramana Reddy) పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీధర్ రావు, శశిధర్ బాలాజీ, రమేశ్, పట్నం రమేష్, ప్రకాశ్, గంజిశీను, అంజన్‌కుమార్, కుంబాల రవియాదవ్, కాళ్ల గణేష్, వైద్య కిషన్ రావు, డాక్టర్ ఏవి శ్రీనివాస్, భక్తులు పాల్గొన్నారు.