Covid
Covid | తెలంగాణలో కరోనా కేసు నమోదు

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Covid | దేశంలో కరోనా మరోసారి గుబులు పుట్టిస్తోంది. గత కొన్ని రోజులుగా కేసుల సంఖ్య పెరుగుతోంది. పలువురు సినీ ఇండ్రస్ట్రీ ప్రముఖులు కోవిడ్​ బారిన పడిన విషయం తెలిసిందే. ముంబై, చెన్నె, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో వరుసగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా తెలుగు రాష్ట్రాలకు విస్తరించింది.

గురువారం ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ పట్నంలో ఓ మహిళకు కరోనా సోకగా.. శుక్రవారం తెలంగాణలో కోవిడ్​ కేసు వెలుగు చూసింది. హైదరాబాద్​కు చెందిన కూకట్​పల్లిలో ఓ వైద్యుడి కరోనా పాజిటివ్​ నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. కాగా.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కనీస జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని చెబుతున్నారు.