Midday Meal
Midday Meal | మధ్యాహ్న భోజనం నిధులు విడుదల

అక్షరటుడే, ఇందూరు: Mid day Meals | మధ్యాహ్న భోజనానికి సంబంధించి కుక్ కం హెల్పర్లకు గౌరవ వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. 2025- 26కు గాను జిల్లాకు సంబంధించి రూ.59.27 లక్షలు విడుదలైనట్లు డీఈవో అశోక్ (DEO Ashok) తెలిపారు. సంబంధిత నిధులు మండలాల వారీగా ఎంఈవోలకు చేరాయన్నారు. త్వరలోనే సీసీహెచ్​ల ఖాతాల్లోకి జమ చేస్తారని ఆయన వివరించారు.