ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిAcb Trap | ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్​ పబ్లిక్ ప్రాసిక్యూటర్.. కానిస్టేబుల్

    Acb Trap | ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్​ పబ్లిక్ ప్రాసిక్యూటర్.. కానిస్టేబుల్

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Acb Trap | కామారెడ్డి కోర్టులో విధులు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (Assistant Public Prosecutor) ఏసీబీ అధికారులకు చిక్కడం కలకలం రేపింది. కోర్టు కానిస్టేబుల్ (Court Constable) ద్వారా రూ.10వేలు లంచం తీసుకుంటుండగా శుక్రవారం ఏసీబీ అధికారులు రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

    ఏసీబీ డీఎస్పీ శేఖర్​గౌడ్ (ACB DSP Shekhar Goud)​ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి పట్టణ పోలీస్​స్టేషన్​లో (Kamareddy Police Station) 2018లో నమోదైన చీటింగ్ కేసుపై కోర్టులో విచారణ కొనసాగుతోంది. అయితే ఈ కేసును త్వరగా ముగించడానికి ఏపీపీ గుగ్లోత్ అశోక్ శివరాం (APP Gugloth Ashok Shivaram Nayak ) బాధితునికి రూ.15వేల లంచం డిమాండ్ చేశాడు. చివరికి రూ.10వేలకు ఒప్పందం చేసుకున్నాడు.

    పట్టణ పోలీస్​స్టేషన్​లో విధులు నిర్వర్తిస్తున్న కోర్టు కానిస్టేబుల్ సంజయ్ ద్వారా శుక్రవారం బాధితుడి నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. సుమారు ఐదు గంటలుగా కేసు విచారణ కొనసాగుతోంది. ఏపీపీ ఇంట్లో సోదాలు జరుగుతున్నట్లు డీఎస్పీ తెలిపారు. విచారణ అనంతరం ఏపీపీ, కోర్టు కానిస్టేబుళ్లను అరెస్టు చేసి, హైదరాబాద్‌లోని నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో శనివారం హాజరుపరుస్తామని పేర్కొన్నారు. అయితే కానిస్టేబుల్ సంజయ్ గ్రూప్స్​కు ప్రిపేర్ అవుతున్నారు. ఏపీపీ అశోక్ శివరాం నాయక్ సైతం జడ్జి పోస్టు కోసం సిద్ధమవుతున్నట్లుగా సమాచారం.

    More like this

    Dev Accelerator Limited | నేడు మరో ఐపీవో ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dev Accelerator Limited | ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ వ్యాపారంలో ఉన్న దేవ్‌ యాక్సిలరేటర్ కంపెనీ...

    Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలు.. హైకోర్టు తీర్పుపై అప్పీల్​కు వెళ్లాలని టీజీపీఎస్సీ నిర్ణయం!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలపై హైకోర్టు (High Court) తీర్పు వెలువరించిన విషయం...

    PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ...