అక్షరటుడే, వెబ్‌డెస్క్:Allu Arjun | సినీ హీరో అల్లు అర్జున్ చిక్కుల్లో పడ్డారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంధ్యా థియేటర్ (Sandhya Theater) ఘటన వివాదం ముగిసి పోయిందకుంటున్న తరుణంలో మరోసారి తెర పైకి వచ్చింది.
ఈ ఘనటలో జాతీయ మానవ హక్కుల కమిసన్ (ఎన్‌హెచ్ ఆర్‌సీ) తాజాగా జోక్యం చేసుకుంది. ఇందులో పోలీసుల వైఫల్యంపై హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్(Hyderabad Police Commissioner CV Anand)కు నోటీసులు జారీ చేసింది. తొక్కిసలాట ఘటనకు సంబంధించి పోలీసులు అందజేసిన నివేదికలో సరైన వివరాలు లేవని పేర్కొంది. పోలీసు స్టేషన్‌కు సమీపంలో డీజేలు, ఇంత హంగామా జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీసింది.
Allu Arjun | పుష్ప2 రిలీజ్ సందర్భంగా తొక్కిసలాట
అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ పుష్ప(Pushpa) భారీ విజయం సాధించడంతో అదే స్థాయిలో పుష్ప 2 నిర్మించారు. ఈ సినిమా రిలీజ్ ముందు గతేడాది డిసెంబర్ 4వ తేదీన ప్రీమియర్ షో వేశారు. హైదరాబాద్(Hyderabad) ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్యా థియేటర్‌లో ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ రాగా అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఈ క్రమంలో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీచార్జ్ చేశారు. ఈ క్రమంలో తొక్కిసలాటి జరిగి దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి (35) మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడ్ని దవాఖానకు తరలించగా, దాదాపు ఐదు నెలలకు పైగా అతడున హాస్పిటల్లో చికిత్ సొంది ఇటీవలే డిశ్చార్జ్ అయ్యాడు.
Allu Arjun | అల్లు అర్జున్‌పై కేసు..
సంధ్య థియేటర్(Sandhya Theater) వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందడం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. దీంతో హైరదాబాద్ పోలీసులు అల్లు అర్జున్‌తో పాటు థియేటర్ యాజమాన్యం కేసు నమోదు చేశారు. పలుమార్లు బన్నీని విచారణకు పిలిచారు. ఈ ఘటనపై స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్(National Human Rights Commission) తొక్కిసలాటకు సంబంధించి పూర్తి నివేదికను అందించాలని హైదరాబాద్ సిటీ పోలీసులను గత జనవరిలో ఆదేశించింది. దీంతో పోలీసులు నివేదిక సమర్పించారు.
అల్లు అర్జున్ రావడం వల్లనే తొక్కిసలాట జరిగిందని, లాఠీ ఛార్జ్ చేయలేదని నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదికపై తాజాగా స్పందించిన ఎన్‌హెచ్ఆర్‌సీ(NHRC).. నివేదిక సమగ్రంగా లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు(Police) ఇచ్చిన నివేదికలో సరైన వివరాలు లేవని, పోలీస్ స్టేషన్ కు సమీపంలో డీజేలు, ఇంత హంగామా జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీసింది. అసలు స్పెషల్ షోకు అనుమతి ఇవ్వనప్పుడు అల్లు అర్జున్(Allu Arjun) థియేటర్ కి ఎలా వస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్ని వివరాలతో సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించింది.