అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Nizamabad City | అర్ధరాత్రి వరకు పాన్‌షాప్ తెరిచి ఉంచిన ఒకరికి న్యాయస్థానం జైలుశిక్ష విధించింది. ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి (SHO Raghupathi) తెలిపిన వివరాల ప్రకారం.. అర్సపల్లి(arsapally)లోని ఓ పాన్‌షాప్ అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచడంతో పోలీసులు పాన్‌షాప్ యజమాని షేక్ ఫయాజ్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చగా అతడికి ఒకరోజు జైలుశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిందని ఎస్‌హెచ్‌వో తెలిపారు.
