ePaper
More
    HomeతెలంగాణRaghunandan Rao | కవిత మరో షర్మిల కాబోతుంది.. ఎంపీ రఘునందన్​ సంచలన వ్యాఖ్యలు

    Raghunandan Rao | కవిత మరో షర్మిల కాబోతుంది.. ఎంపీ రఘునందన్​ సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Raghunandan Rao | మెదక్​ ఎంపీ రఘునందన్​రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR)​కు ఆమె కూతురు, ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) రాసిన లేఖ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ లేఖ పలువురు నాయకులు స్పందించగా.. తాజాగా ఎంపీ రఘునందన్​రావు మాట్లాడారు. కవిత లేఖ రాజకీయ పంచాయితీనా.. ఆస్తుల పంచాయితీనా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్‌ కుటుంబంలో వారసత్వ చిచ్చు మొదలైందని ఆయన ఆరోపించారు.

    బీఆర్ఎస్(BRS)​ నుంచి కవితను బయటకు పంపేందుకు మాజీ మంత్రి బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్(KTR)​, హరీశ్​రావు(Harish Rao) ఒక్కటయ్యారని రఘునందన్​రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో కవిత మరో షర్మిల(Sharmila) కాబోతుందని ఆయన పేర్కొన్నారు. కవిత కాంగ్రెస్​లోకి వెళ్లే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కవిత వెనక సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఉన్నట్లు ఎంపీ అనుమానం వ్యక్తంచ చేశారు. ఎవరేం చేసినా తెలంగాణలో బీజేపీదే అధికారం అని ధీమా వ్యక్తం చేశారు.

    కాగా.. కవిత లేఖపై స్పందించి బీజేపీ ఎంపీ డీకే అరుణ సైతం సీఎం రేవంత్​రెడ్డికి, కవితకు మంచి సంబంధాలు ఉన్నాయని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కవిత(MLC Kavitha) తన తండ్రికి రాసిన లేఖ ఎలా బయటకు వచ్చిందని ఆమె ప్రశ్నించారు. కాగా కాంగ్రెస్​ నాయకులు సైతం కవిత లేఖపై స్పందిస్తూ బీఆర్​ఎస్​(BRS)లో లుకలుకలు మొదలయ్యాయని విమర్శిస్తున్నారు.

    More like this

    Excise Department | మత్తుపదార్థాలు రవాణా చేస్తున్న ఒకరి అరెస్ట్

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Excise Department | అల్ప్రాజోలం రవాణా చేస్తున్న ఒకరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు....

    Mumbai Navy Yard | నేవీ యార్డులో ఆయుధాల చోరీ.. నేవీ కానిస్టేబుల్, అతడి సోదరుడి అరెస్టు

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Mumbai Navy Yard | తెలంగాణకు చెందిన నేవీ కానిస్టేబుల్ (Navy Constable) దొంగ...

    Bodhan | బోధన్​లో ‘ఉగ్ర’​ లింకుల కలకలం

    అక్షరటుడే, బోధన్​ : Bodhan | నిజామాబాద్​ జిల్లా బోధన్​లో ఉగ్రవాద లింకులు కలకలం సృష్టించాయి. కేంద్ర దర్యాప్తు...