అక్షరటుడే, ఆర్మూర్: Paddy Centers | తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్మూర్ మున్సిపల్ (Armoor municipality) పరిధిలోని మామిడిపల్లి చౌరస్తాలో శుక్రవారం మొలకెత్తిన ధాన్యంతో రాస్తారోకో చేశారు. జాతీయ రహదారిపై భైఠాయించారు. అనంతరం మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయిందన్నారు. అధికారులు తక్షణమే ధాన్యాన్ని కొనకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
