అక్షరటుడే, నిజాంసాగర్:Inter Exams | ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్ల ఓ విద్యార్థి పరీక్షకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా దోమకొండకు చెందిన చింతల శంకర్ నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గురుకుల పాఠశాల(Gurukul School)లో ఇంటర్ సెకండియర్(సీఈసీ) చదువుతున్నాడు. ఫస్టియర్ ఉత్తీర్ణులయ్యాడు. ప్రస్తుత విద్యాసంవత్సరం సెకండియర్‌లో ఎకనామిక్స్ మినహా అన్ని సబ్జెక్టుల్లో పాసయ్యాడు. అయితే సప్లిమెంటరీ పరీక్షల కోసం గత నెల 30న పరీక్ష ఫీజు(Exam Fee)కు ఆఖరి తేదీ కావడంతో విద్యార్థి శంకర్ తండ్రి సాయిలు అదే రోజు గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుడికి ఫోన్‌పే(Phone pay) ద్వారా డబ్బులు చెల్లించాడు.
అయితే ఉపాధ్యాయుడు కంప్యూటర్ ఆపరేటర్(Computer Operator)కు ఫీజు డబ్బులు చెల్లించాలని వారి వద్ద నుంచి అతనికి డబ్బులను ట్రాన్స్ఫర్ చేశాడు. అయితే సప్లిమెంటరీ ఫీజు డబ్బులు చెల్లించామని అనుకున్నారు.కాగా.. హాల్ టికెట్(Hall Ticket) కోసం ఈనెల 20న ఫోన్ చేయడంతో హాల్ టికెట్ గురుకుల పాఠశాలకు వచ్చి తీసుకెళ్లాలని తెలిపారు. దీంతో విద్యార్థి శంకర్ తండ్రి సాయిలుతో పాటు గురుకుల పాఠశాలకు రాగా.. ఎక్కడో చిన్న పొరపాటు జరిగిందని విద్యార్థి హాల్ టికెట్(Student Hall Ticket) రాలేదని తెలిపారు. ఫీజు డబ్బులు చెల్లించలేదని పాఠశాల సమాధానం ఇచ్చారు. కానీ డబ్బులు చెల్లించామని వారు చెప్పారు. ఈ విషయమై ప్రిన్సిపాల్‌కు ఫోన్‌చేసి అడగగా ఎక్కడో చిన్న పొరపాటు జరిగిందని జిల్లా నోడల్ ఆఫీసర్(Nodal Officer)కు మాట్లాడాలని చెప్పారు. లేదంటే ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయానికి(Intermediate Board Office) వెళ్తే సమస్య పరిష్కారం అవుతుందని దాటవేశారు. అనంతరం నోడల్ ఆఫీసర్ వద్దకు వెళ్లగా తమ చేతుల్లో సమాధానం ఇవ్వడంతో కంగుతిన్నారు. తన కుమారుడి పరీక్ష రాయకపోతే ఏడాది వృథా అవుతుందని సాయిలు ఆవేదన వ్యక్తం చేశాడు. ఉన్నతాధికారులు తగిన చర్యలు తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.