అక్షరటుడే, వెబ్‌డెస్క్:IPL 2025 | ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2025లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన 64వ మ్యాచ్‌లో సొంత గడ్డపై గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)ని 33 పరుగులతో ఓడించి కాస్త ఆనందం చెందింది లక్నో LSG టీమ్.
ఈ ఐపీఎల్ సీజన్‌లో లక్నో ఆడిన 13 మ్యాచ్‌ల్లో ఇది ఆరో విజయం కాగా.. ఈ గెలుపు ఆ జట్టుకు ప్రత్యేక ప్రయోజనమేమీ చేకూర్చదు. గత మ్యాచ్‌లో లక్నో ఓటమి బాట పట్టడంతో ప్లేఆఫ్స్(Plyoffs)కి అర్హత సాధించలేకపోయింది. ఇంకో మ్యాచ్ లక్నో ఆడాల్సి ఉండగా, అది గెలిచినా కూడా లక్నో ఖాతాలో 14 పాయింట్లే చేరతాయి. కాబట్టి ఇక లక్నోకి ఈ సారి ప్లే ఆఫ్స్‌లో ఛాన్స్ లేదు. మరో వైపు గుజరాత్ ఓటమి బాటపట్టిన ఆ టీమ్ ఖాతాలో 18 పాయింట్స్ ఉన్నాయి. ఇప్పటికీ టాప్‌లోనే ఉంది. జీటీ (GT)కూడా మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది.
IPL 2025 | లక్నో విజయం..
అయితే అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం(Narendra Modi Cricket Stadium)లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన తర్వాత గుజరాత్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ (Gujarat captain Shubman Gill) ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు తరఫున మిచెల్ మార్ష్ సెంచరీ(117) MARSH, నికోలస్ పూరన్ అర్థ సెంచరీ(56*)తో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేయగలిగింది. 56 బంతుల్లోనే మిచెల్ మార్ష్ తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో మిచెల్ మార్ష్ (Mitchell Marsh) 64 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సులతో 117 పరుగులు చేసి ఔటయ్యాడు. నికోలస్ పూరన్ తన మెరుపు అర్ధశతకంతో విరుచుకుపడ్డాడు. పూరన్ 27 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సులతో 56 పరుగులతో అజేయంగా నిలిచాడు.
మార్ష్, పూరన్ రెండో వికెట్ కు 121 పరుగుల పార్టనర్షిప్ నెలకొల్పారు. గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్, సాయి కిషోర్ తలో వికెట్ తీశారు. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గుజరాత్ జట్టు(Gujrat Team) 9 వికెట్లు కోల్పోయి 202 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ విధంగా గుజరాత్ తన సొంత మైదానంలో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. షారుఖ్ ఖాన్(57), రూథర్‌ఫోర్డ్(38) అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. కానీ జట్టును విజయపథంలో నడిపించడంలో విఫలమయ్యారు. గుజరాత్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న సాయిసుదర్శన్(21), శుభ్ మన్ గిల్(35), జోస్ బట్లర్(33) Butlerఈ మ్యాచ్ లో భారీ స్కోర్లు చేయలేకపోవడంతో ఓటమి పాలు కావల్సి వచ్చింది. రాహుల్ తెవాటియా(2) కూడా నిరాశపరిచారు. లక్నో బౌలర్లలో విలియా ఓరూర్కే 2 వికెట్లు పడగొట్టగా.. ఆయుష్ బదోని, అవేష్ ఖాన్ తలో 2 వికెట్లు తీశారు. ఆకాశ్ మహరాజ్ సింగ్, షాబాజ్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.