ePaper
More
    HomeతెలంగాణDK Aruna | సీఎంతో కవితకు మంచి సంబంధాలు ఉన్నాయి.. డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు

    DK Aruna | సీఎంతో కవితకు మంచి సంబంధాలు ఉన్నాయి.. డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: DK Aruna | మాజీ ముఖ్యమంత్రి, బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​కు ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) రాసిన లేఖ ఇటీవల బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ లేఖలో కవిత తన తండ్రిని పలు ప్రశ్నలు అడిగారు. బీఆర్​ఎస్​ రజతోత్సవ సభలో బీజేపీ(BJP) గురించి కేవలం రెండు నిమిషాలే మాట్లాడారని.. దీంతో భవిష్యత్​లో బీఆర్​ఎస్​, బీజేపీ పొత్తు పెట్టుకుంటాయనే ప్రచారం జరుగుతోందన్నారు. కాగా.. ఎమ్మెల్సీ కవిత లేఖపై బీజేపీ ఎంపీ డీకే అరుణ(BJP MP DK Aruna) స్పందించారు. కవిత తన తండ్రికి రాసిన లేఖ ఎలా బయటకు వచ్చిందని ఆమె ప్రశ్నించారు.

    కేసీఆర్​ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi)పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని డీకే అరుణ అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్‌ చాలా బలహీనపడిందని తెలిపారు. సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy), కాంగ్రెస్​ పార్టీతో కవితకు మంచి సంబంధాలు ఉన్నాయని డీకే అరుణ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో బీజేపీ బలపడుతుండడంతో కవిత లేఖ రాశారని విమర్శించారు.

    కాగా.. కవిత(Kavitha) లేఖ రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. బీఆర్​ఎస్​ పార్టీలో ఆధిపత్య పోరు నడుస్తుందని, అందుకు కవిత లేఖ నిదర్శనమని పలువురు కాంగ్రెస్​, బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. రానున్న రోజుల్లో కవిత సొంత కుంపటి పెట్టుకుంటారని పేర్కొంటున్నారు. మరి దీనిపై బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​, వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ ఎలా స్పందిస్తారో చూడాలి.

    More like this

    Nepal Govt | నేపాల్‌లో తాత్కాలిక ప్రభుత్వం..? మాజీ సీజే సుశీలా కార్కీని నియమించాలని జెన్ జడ్ పట్టు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Nepal Govt | రెండ్రోజులుగా నిరసనలు, అల్లర్లతో అట్టుడికి పోయిన నేపాల్(Nepal)లో ఇప్పుడిప్పుడి శాంతియుత పరిస్థితులు...

    Diabetes | షుగర్ వ్యాధి పట్ల జాగ్రత్తలు పాటించాలి

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Diabetes | షుగర్ వ్యాధి (Diabetes) పట్ల పలు జాగ్రత్తలు పాటిస్తే ఈ వ్యాధిని...

    Care Degree College | 12న కేర్ డిగ్రీ కళాశాలలో రిక్రూట్​మెంట్ డ్రైవ్

    అక్షరటుడే, ఇందూరు: Care Degree College | నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో ఈనెల 12న రిక్రూట్ మెంట్...