ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Kodali Nani | కొడాలి నానిపై లుక్ అవుట్ నోటీసులు జారీ.. అన్నంత ప‌ని చేశారుగా..!

    Kodali Nani | కొడాలి నానిపై లుక్ అవుట్ నోటీసులు జారీ.. అన్నంత ప‌ని చేశారుగా..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Kodali Nani | వైసీపీ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న కొడాలి నాని Kodali nani అనారోగ్యంతో హైదరాబాద్‌(Hyderabad)లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన విష‌యం తెలిసిందే. అక్కడ డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించగా.. గుండెకు సంబంధించి సమస్య ఉన్నట్లు గుర్తించ‌డంతో మెరుగైన వైద్యం కోసం కొడాలి నానిని అంబులెన్స్‌లో ముంబైకి తరలించారు. అక్కడ ఏషియన్‌ హార్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌(Asian Heart Institute)లో చేర్చగా అత్యంత సంక్లిష్టమైన కార్డియాక్‌ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేశారు. ముంబైలోనే కొద్దిరోజులు ఆస్పత్రిలో ఉన్న నాని ఇటీవ‌ల హైదరాబాద్ వచ్చారు. అయితే ఇప్పుడు మరింత మెరుగైన వైద్యం కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉండ‌డంతో లుకౌట్ నోటీసులు(Lookout Notice) జారీ చేసినట్లు తెలుస్తోంది.

    Kodali Nani | నానికి నోటీసులు..

    మాజీ మంత్రి కొడాలి నానిపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ అయింది. దేశంలోని అన్ని విమానాశ్రయాలు, పోర్టులకు సర్క్యులర్ పంపించారు. నానిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన దేశం విడిచి వెళ్లకుండా ఏపీ పోలీసులు(AP Police) ఆయనకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్‌ ఈ నోటీసులను జారీ చేసినట్లు తెలుస్తోంది. కొడాలి నానిపై అక్రమాలకు సంబంధించి విజిలెన్స్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన కదలికలపై నిఘా ఉంచాలంటూ తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) చేసిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.టీడీపీ నేత కనపర్తి శ్రీనివాస్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. నాని అనారోగ్యం పేరుతో అమెరికా America వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఆయన పాస్‌పోర్టును సీజ్ చేయాలని కోరారు.

    కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు ఈ ఫిర్యాదును పరిశీలించి 2019లో నాని పాస్‌పోర్టు Passport కోసం దరఖాస్తు చేసుకోగా, కేసులు ఉండడంతో తిరస్కరించారు. గత ప్రభుత్వ హయాంలో పాస్‌పోర్టు వచ్చిందేమోనని రికార్డులు చూస్తే, ఆయనకు పాస్‌పోర్టు లేదని పోలీసులు గుర్తించారట. దీని కోసం రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయానికి(Passport Office) వివరాలు కోరుతూ లేఖ రాసినట్లు సమాచారం. హైదరాబాద్‌ చిరునామాతో పాస్‌పోర్టును పొంది ఉంటారని అనుమానిస్తున్నారట.. ఈలోపు ముందస్తు జాగ్రత్తగా లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నోటీసుల ప్రకారం విమానాశ్రయాలు, ఓడరేవులు, ఇతర సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండి, కొడాలి నాని(Kodali Nani) దేశం విడిచి వెళ్లకుండా చర్యలు తీసుకుంటారు. ఆయన కదలికలపై నిరంతరం నిఘా ఉంచుతారు.

    Latest articles

    Today Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    Today Panchangam : తేదీ(DATE) – 17 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama...

    Professor Limbadri | తెలంగాణ ఉన్నత విద్య మండలి మాజీ ఛైర్మన్ లింబాద్రికి మాతృవియోగం

    అక్షరటుడే, నిజామాబాద్ : Professor Limbadri : తెలంగాణ ఉన్నత విద్యా మండలి మాజీ ఛైర్మన్ ప్రొఫెసర్ రిక్క...

    film industry bandh issue | చిరంజీవి చెంతకు సినీ పరిశ్రమ బంద్‌ వ్యవహారం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: film industry bandh issue : సినీ పరిశ్రమ బంద్‌ వ్యవహారం చిరంజీవి దగ్గరకు చేరింది....

    RGV criticizes dog lovers | డాగ్ లవర్స్ పై ఆర్జీవీ విమర్శనాస్త్రాలు.. దుమ్ము దులిపేశాడు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RGV criticizes dog lovers : భారత్​ క్యాపిటల్​ సిటీ ఢిల్లీతోపాటు దాని సమీప ప్రాంతాల్లో...

    More like this

    Today Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    Today Panchangam : తేదీ(DATE) – 17 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama...

    Professor Limbadri | తెలంగాణ ఉన్నత విద్య మండలి మాజీ ఛైర్మన్ లింబాద్రికి మాతృవియోగం

    అక్షరటుడే, నిజామాబాద్ : Professor Limbadri : తెలంగాణ ఉన్నత విద్యా మండలి మాజీ ఛైర్మన్ ప్రొఫెసర్ రిక్క...

    film industry bandh issue | చిరంజీవి చెంతకు సినీ పరిశ్రమ బంద్‌ వ్యవహారం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: film industry bandh issue : సినీ పరిశ్రమ బంద్‌ వ్యవహారం చిరంజీవి దగ్గరకు చేరింది....