అక్షరటుడే, వెబ్డెస్క్: TTD | తిరుమల(tirumala) శ్రీవారిని దర్శించుకునే భక్తుల కోసం శుక్రవారం ఉదయం టీటీడీ(ttd) టికెట్లు విడుదల చేయనుంది. ఆగస్టుకు(august quota) సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఉదయం 10 గంటలకు విడుదల చేసింది. శ్రీవాణి ట్రస్టు(srivani trust) టికెట్లను ఉదయం 11 గంటలకు విడుదల చేయనుంది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఆగస్టు నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో పెట్టనుంది.
TTD | ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా
ఆగస్టు నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన(special darshan) టికెట్ల కోటాను మే 24న ఉదయం 10 గంటలకు, తిరుమల, తిరుపతిలలో ఆగస్టు నెల గదుల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. శ్రీవారి సేవ(తిరుమల, తిరుపతి), పరకామణి సేవ, నవనీత సేవ, టీమ్ లీడర్స్ (సీనియర్ సేవక్స్) సేవల జూలై కోటాను మే 29న ఉదయం 11 గంటలకు వెబ్సైట్(Web Site)లో రిలీజ్ చేయనుంది.