Demanding money, claiming to be CM OSD
CM OSD | సీఎం ఓఎస్​డీని అంటూ డబ్బులు డిమాండ్​.. యువకుడి అరెస్ట్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM OSD | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి cm revanth reddy ఓఎస్​డీని OSD అంటూ డబ్బులు డిమాండ్​ చేస్తున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు. శ్రీకాకుళం srikakulam జిల్లా నర్సన్న పేటకు చెందిన నాగరాజు(32) సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శిని, ఓఎస్డీని అంటూ డబ్బులు కావాలంటూ పలువురికి మెయిల్స్​, వాట్సాప్​ మెసెజ్​లు పెట్టాడు.

బొల్లినేని ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్ ఎండీ శ్రీకృష్ణ మోహన్ బొల్లినేని, ర్యాపిడో ఎండీ అరవింద్ సంకా, గుప్తా రియాలిటీ ఛైర్మన్ శ్రీనివాస్ గుప్తా వెర్రబొమ్మ, కంట్రీడిలైట్ ఎండీ చక్రధర్, నితిన్ కౌశల్‌తో పాటు పలువురికి ఇలా డబ్బుల కోసం సందేశాలు పంపాడు. దీనిపై సీఎం రేవంత్‌ రెడ్డి స్పెషల్‌ సెక్రెటరీ అజిత్‌ రెడ్డి cm special secretery Ajit Reddy పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నాగరాజును ఏపీలో అరెస్టు చేసి హైదరాబాద్‌ hyderabadకు తీసుకొచ్చారు. అనంతరం కోర్టులో హాజరు పరిచి రిమాండ్​కు తరలించారు.