ePaper
More
    HomeతెలంగాణHeavy Rains | ఆగని వర్షాలు.. రైతుల ఇబ్బందులు

    Heavy Rains | ఆగని వర్షాలు.. రైతుల ఇబ్బందులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Rains | రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం తెల్లవారుజాము నుంచి గురువారం అర్ధరాత్రి వరకు పలు ప్రాంతాల్లో వర్షం rain కురిసింది. అరేబియా సముద్రం Arabian Seaలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. వానాకాలం Rainy season ప్రారంభం కాకముందే జోరు వానలు పడుతుండడంతో వాగులు, వంకలు జలకళను సంతరించుకున్నాయి. చెరువుల్లోకి అప్పుడే నీరు రావడం మొదలైంది.

    Heavy Rains | వర్షపాతం వివరాలు

    రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. అత్యధికంగా ఆదిలాబాద్​ జిల్లా నార్నూర్​లో 127.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిజామాబాద్​ జిల్లా ధర్పల్లిలో 101.3 మి.మీ., జగిత్యాల 88, జగిత్యాల జిల్లా మేడిపల్లి 86.5, ఆదిలాబాద్​ జిల్లా తాళ్లమడుగు 82.3, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​ 79.3, ఆదిలాబాద్​ జిల్లా పిప్పాయిదారిలో 78.8, నిజామాబాద్​ జిల్లా సిరికొండలో 70.8, కామారెడ్డి జిల్లా ఇసాయిపేట్​లో 64.8 మి.మీ. వర్షం కురిసింది.

    Heavy Rains | ముందుగానే వానాకాలం

    ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు Southwest monsoon చురుగ్గా కదులుతున్నాయి. దీంతో వానాకాలం ముందుగానే ప్రారంభం కానుంది. జూన్​ మొదటి వారంలో తెలంగాణ telangnaలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే రుతుపవనాలు రాకముందే అల్ప పీడనం ప్రభావంతో భారీ వర్షాలతో ప్రస్తుతం వానాకాలాన్ని తలపిస్తోంది.

    Heavy Rains | నేడు కూడా వర్షాలు

    రాష్ట్రవ్యాప్తంగా గత మూడు రోజులుగా వర్షాలు పడుతుండటంతో వాతావరణం చల్లబడింది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. మరోవైపు శుక్రవారం కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం నుంచే వాతావరణం మేఘావృతమై ఉంది. సాయంత్రం నుంచి రాత్రి వరకు వాన పడే ఛాన్స్​ ఉన్నట్లు అధికారులు తెలిపారు.

    Heavy Rains | తడిసిపోతున్న ధాన్యం

    రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం సేకరణ paddy ప్రక్రియ దాదాపు చివరి దశకు చేరింది. అయితే కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం వర్షానికి తడిసి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పలు జిల్లాల్లో లారీల కొరతతో తూకం వేసిన ధాన్యం బస్తాలు పేరుకుపోయాయి. వర్షానికి బస్తాల్లోని ధాన్యం తడిసి పోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ధాన్యం ఆరబోయడం ఎలా అని.. ఒకవేళ ఆరబోద్దాం అనుకున్నా నిత్యం వానపోడుతోందని వాపోతున్నారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...