అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) బీఆర్ఎస్ సత్తా చాటాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో కేటీఆర్‌ను మాజీ జడ్పీటీసీ మనోహర్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. పార్టీ పటిష్టతను పెంచే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. తూఫ్రాన్ (Toofran) మాజీ జడ్పీటీసీ సత్యనారాయణ గౌడ్ ఆయనతో ఉన్నారు.
