ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​New Ration Cards | కొత్త రేష‌న్ కార్డులపై శుభ‌వార్త చెప్పిన నాదెండ్ల‌.. 21 రోజుల్లోనే...

    New Ration Cards | కొత్త రేష‌న్ కార్డులపై శుభ‌వార్త చెప్పిన నాదెండ్ల‌.. 21 రోజుల్లోనే జారీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: New Ration Cards | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు(New Ration Cards) కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్న విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే. అయితే కొత్త రేషన్ కార్డులకు Ration Cards దరఖాస్తు చేసినవారికి ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేవారికి కీలక ఆదేశాలు జారీ చేశారు. అప్లై చేసుకునేవారికి ఉన్న వివిధ సందేహాలను నివృత్తి చేశారు. మే 8వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డుల(New Ration Cards) కోసం దరఖాస్తు ప్రక్రియ మొదలు కాగా, అర్హులైన వారు కొత్త రేషన్ కార్డులు, రేషన్ కార్డులో మార్పులు, చేర్పులు వంటి వాటి కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేస్తున్నారు.

    New Ration Cards | గుడ్ న్యూస్..

    అయితే కొత్త రేషన్ కార్డు కోసం మ్యారేజ్ సర్టిఫికేట్ Marriage Certificate కావాలంటూ వార్తలు వస్తు్న‌న నేప‌థ్యంలో నాదండ్ల మ‌నోహ‌ర్ వివ‌ర‌ణ ఇచ్చారు .. కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు(Ration Card Applications) చేసుకున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నాదెండ్ల మనోహర్‌ అన్నారు. కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు స్వీకరించిన 21 రోజుల్లోనే ఆ అప్లికేషన్ పరిష్కరిస్తామని తెలిపారు. కొత్త రేషన్‌ కార్డుకు మ్యారేజ్‌ సర్టిఫికెట్ అవసరమనే ప్రచారంపైనా స్పందించారు. కొత్త రేషన్ కార్డు కోసం వివాహ ధ్రువీకరణ పత్రం, పెళ్లి కార్డు, పెళ్లి ఫొటో వంటివి అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు. క్షేత్రస్థాయి సిబ్బంది ఈ విషయంలో ఎలాంటి పొరపాట్లు చేయొద్దని ఆదేశించారు.

    కొత్త రేషన్ కార్డుల కోసం ఆందోళన అవసరం లేదని.. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అని నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) అన్నారు. రేషన్ దరఖాస్తులకు గడువు లేదన్న మంత్రి.. అర్హత కలిగినవారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. నిబంధనల ప్రకారం అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తామన్నారు. రేషన్ కార్డుల(Ration Cards) కోసం ఇప్పటి వరకు 5 లక్షల దరఖాస్తులు మాత్రమే వచ్చాయని.. అందులో 60 వేల మంది కొత్త బియ్యం కార్డులు కావాలని దరఖాస్తు చేశారని వివరించారు. సాంకేతికపరమైన లోపాల వలన కలిగిన ఈ ఇబ్బందికి క్షమాపణ చెప్పారు. ఇక రాష్ట్రంలోని 4,24,59,128 మందికి జూన్ నెలలో ప్రభుత్వమే ఉచితంగా స్మార్ట్​ రేషన్ కార్డులు(Smart ration cards) అందిస్తుందని తెలిపారు. జూన్ ఒకటో తేదీ నుంచి రేషన్ సరుకులను రేషన్ షాపుల(Ration shops) ద్వారానే పంపిణీ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసినవారికి 21 రోజుల్లోపే కార్డులు జారీ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ భరోసా ఇచ్చారు. మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదని స్పష్టం చేశారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...