ePaper
More
    HomeతెలంగాణHeavy Rains | వర్షాలే వర్షాలు.. మరో మూడు రోజుల పాటు హెవీ రెయిన్స్

    Heavy Rains | వర్షాలే వర్షాలు.. మరో మూడు రోజుల పాటు హెవీ రెయిన్స్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Heavy Rains | రాష్ట్రంలో మరో రెండు రోజుల భారీ వర్షాలు(Heavy Rains) కురవనున్నాయి. అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడంతో వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Center) తెలిపింది. అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతోందని పేర్కొంది. ఈ కారణంగా రానున్న 36 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పింది. అంతేకాకుండా ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలోనూ మరో నాలుగైదు రోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.

    Heavy Rains | ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

    అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Meteorological Department) తెలిపింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. శుక్రవారం, శనివారాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురవొచ్చని చెప్పింది. ఈ కారణంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.

    Heavy Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం

    రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం రాత్రి, గురువారం భారీ వర్షం కురిసింది. హైదరాబాద్​(Hyderabad)తో పాటు మెదక్​, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, వరంగల్​, మహబూబాబాద్​, పెద్దపల్లి, సిద్దిపేట తదితర జిల్లాల్లో భారీ వర్షాలు(Heavy Rains) కురిశాయి. ఇక మెదక్​ జిల్లా(Medak District)లో అత్యధిక వర్షపాతం నమోదైంది. రానున్న మూడు నాలుగు రోజులు కూడా వర్షం కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

    More like this

    Kammarpalli | ఆదర్శంగా నిలుస్తున్న ఎస్సై అనిల్ రెడ్డి

    అక్షరటుడే, కమ్మర్​పల్లి : Kammarpalli | కమ్మర్​పల్లి ఎస్సై అనిల్ రెడ్డి (SI Anil Reddy) ప్రత్యేకత చాటుకుంటున్నారు....

    Bodhan Traffic Police | బోధన్ ట్రాఫిక్ పోలీసుల సేవలకు హ్యాట్సాఫ్​

    అక్షరటుడే, బోధన్ : Bodhan Traffic Police | బోధన్ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు (traffic police) చేపడుతున్న...

    Ramareddy mandal | యూరియా కోసం రైతుల బారులు

    అక్షరటుడే, కామారెడ్డి: Ramareddy mandal | రామారెడ్డి మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయం (society office) వద్ద యూరియా...