ePaper
More
    Homeటెక్నాలజీCharging Stations | విద్యుత్​​ వాహనదారులకు గుడ్​న్యూస్.. త్వరలో అందుబాటులోకి 72,000 స్టేషన్లు

    Charging Stations | విద్యుత్​​ వాహనదారులకు గుడ్​న్యూస్.. త్వరలో అందుబాటులోకి 72,000 స్టేషన్లు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Charging Stations | దేశంలో విద్యుత్​ వాహనాల electric vehicles in india వినియోగం గణనీయంగా పెరిగింది. గత రెండుమూడేళ్లగా ఈవీ టూవీలర్స్​తో పాటు కార్లు సైతం ప్రజలు భారీ సంఖ్యలో కొనుగులు చేస్తున్నారు. అయితే ఛార్జింగ్​(Charging) అనేది కొంత వరకు సమస్యగా మారింది. ఇక నుంచి ఈ సమస్యకు చెక్​ పడనుంది. ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులు ఇక నుంచి రయ్​రయ్ మంటూ దూసుకెళ్లొచ్చు.

    దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం (Central Government) కీలక నిర్ణయం తీసుకుంది. ‘పీఎం ఈ-డ్రైవ్’ స్కీం(PM E-Drive’ Scheme) కింద దేశవ్యాప్తంగా సుమారు 72వేల ఈవీ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రూ.2వేల కోట్లు కేటాయించనుంది. ఈ నిధులతో కొత్తగా 50 నేషనల్​ హైవే కారిడార్లు, మెట్రో నగరాలు, విమానాశ్రయాలు, టోల్ ప్లాజాలు, రైల్వే స్టేషన్లు, రాష్ట్రాల్లోని రహదారులపై ఛార్జింగ్ స్టేషన్లను (Charging Stations) ఏర్పాటు చేయనున్నట్లు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది.

    Charging Stations | పీఎం ఈ-డ్రైవ్ పథకం అంటే..

    ఎలక్ట్రిక్ వాహనాల(Electric Vehicles) వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ‘పీఎం ఈ-డ్రైవ్’ను ప్రారంభించారు. ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగాన్ని పెంచడానికి ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం ప్రధాన లక్ష్యం. ఈ పథకం భారత్ శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. ఈ పథకంపై జరిగిన సమన్వయ సమావేశంలో కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి కుమారస్వామి (Minister Kumaraswamy) మాట్లాడారు.

    “సుస్థిర రవాణా నిర్వహణలో భారతదేశం​ గ్లోబల్​ మోడల్​గా మారే దిశగా పయనిస్తోంది. పీఎం ఈ-డ్రైవ్ పథకం అనేది పౌరులకు సరసమైన, సౌకర్యవంతమైన రవాణాను అందించే లక్ష్యంతో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం. మౌలిక సదుపాయాలను అందించడమే కాకుండా ఇంధన భద్రత, హరిత ఆర్థిక వృద్ధికి పునాది వేస్తున్నాం” అని కుమారస్వామి పేర్కొన్నారు.

    Latest articles

    Rajagopal Reddy | మరోసారి సీఎం రేవంత్​ను టార్గెట్ చేసిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్!

    అక్షరటుడే, హైదరాబాద్: Rajagopal Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్...

    Heavy rain in Hyderabad | హైదరాబాద్​లో దంచికొడుతున్న వాన.. ఆ ప్రాంతాల్లో కుంభవృష్టి

    అక్షరటుడే, హైదరాబాద్: Heavy rain in Hyderabad : బుధ, గురువారాల్లో భారీ వర్షాలు (Heavy Rain) ఉంటాయని...

    alcohol with volcanic ash | అగ్నిపర్వతాల బూడిదతో మద్యం తయారీ.. తాగారా దీనిని..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: alcohol with volcanic ash : అంతర్జాతీయ బ్రాండ్​ ఆల్కహాల్​ (international brand alcohol) కోసం...

    Good Sleep | పడుకునే ముందు వీటిని తినొద్దు.. అనారోగ్య సమస్యలకు దారి తీయొచ్చు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Good Sleep | మన ఆరోగ్యం, జీవనశైలిలో నిద్ర చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది....

    More like this