అక్షరటుడే,నిజాంసాగర్: Nagamadugu Lift Irrigation Scheme | నిజాంసాగర్ మండలంలోని మంజీరా పరివాహక ప్రాంతంలో నిర్మిస్తున్న నాగమడుగు ఎత్తిపోతల పథకాన్ని గురువారం క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ (Quality Control Department) హైదరాబాద్, నీటిపారుదల శాఖ (Irrigation Department) చీఫ్ ఇంజినీర్ అధికారులు పరిశీలించారు.
అనంతరం క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజినీర్ వెంకటకృష్ణ, నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్ మాట్లాడుతూ వడ్డేపల్లిలో (Vaddepalli) కొనసాగుతున్న మొదటి దశ పంపు హౌస్ పనులు వేగవంతం చేయాలని గుత్తేదారులకు సూచించామన్నారు. పనులను క్షుణ్ణంగా పరిశీలించామన్నారు. వారి వెంట నీటిపారుదల శాఖ ఎస్ఈ రాజశేఖర్, ఈఈ సోలోమన్, భూమారెడ్డి, డి శ్రవణ్ కుమార్ రెడ్డి, దత్తాత్రి, ఏఈ రాజ్ కమల్ ఉన్నారు.