ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​YS Jagan | కూట‌మి పాల‌న‌పై జూన్ 4న‌ వెన్ను పోటు దినం.. జ‌గ‌న్ ఆస‌క్తిక‌ర...

    YS Jagan | కూట‌మి పాల‌న‌పై జూన్ 4న‌ వెన్ను పోటు దినం.. జ‌గ‌న్ ఆస‌క్తిక‌ర కామెంట్స్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :YS Jagan | వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప‌లు కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న వివిధ అంశాల మీద నాణేనికి రెండో వైపులా.. కూటమి ప్రభుత్వం గురించి ప్రజలకు వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నానన్నారు. ‘మనం యుద్ధం చేస్తోంది చంద్రబాబు(YS Jagan Mohan Reddy)తోనే కాదు.. చెడిపోయిన ఎల్లో మీడియాతో కూడా’ అంటూ కామెంట్ చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన వైఫల్యాలపై వైసీపీ YCP జూన్‌ 4న వెన్నుపోటు దినంగా నిర్వహిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ YS Jagan వెల్లడించారు.

    YS Jagan | సినిమా చూపిస్తాం..

    ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలో వచ్చిన కూటమి సర్కార్(Coalition government) క‌నీసం ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోయిందని విమర్శించారు. ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడ్డ జూన్‌ 4న వెన్నుపోటు దినాన్ని నిర్వహించి కలెక్టర్లను(Collectors) కలిసి హామీల డిమాండ్‌ పత్రాలను సమర్పిస్తామని తెలిపారు. వైసీపీ(YCP) హాయంలో లాభాపేక్ష లేకుండా మద్యం అమ్మకాలు జరిపామని, లిక్కర్‌ స్కాం(Liquor Scam) జరుగలేదని స్పష్టం చేశారు. అధికారంలోకి వస్తే మద్యం ధరలు తగ్గిస్తామని చంద్రబాబు అన్నారని, ఆయన పాలనలోనే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని ఆరోపించారు. కూటమి పాలనలో గల్లీగల్లీకి బెల్ట్‌షాపులు వెలిశాయని దుయ్య బట్టారు. గతంలో లిక్కర్‌ స్కాంలో నిందితుడిగా ఉన్న చంద్రబాబు Chandra babu ఇవాళ్లికి బెయిల్‌ మీద ఉంది నిజం కాదా అంటూ నిలదీశారు.

    తమ అనుచరులను బెదిరించి తప్పుడు సాక్ష్యాలను సృష్టించి తప్పుడు వాంగ్మూలాలతో చంద్రబాబు లిక్కర్‌ స్కాం అంటూ భయానక పరిస్థితులు సృష్టిస్తున్నారని జగన్‌ ఆరోపించారు. విజయసాయిరెడ్డి (Vijayasai reddy) చంద్రబాబుకు లొంగిపోయారని విమర్శించారు. ఈ ఏడాదిలో రాష్ట్ర రాబడి చూస్తే ప్రభుత్వ పనితీరు తెలుస్తోందన్నారు. కేవలం 3.08 శాతం అభివృద్ది రేటు కనిపిస్తోందన్నారు. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందనడానికి ఇదే నిదర్శనం అన్నారు. చంద్రబాబు పనితీరు ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఇదే ఉదాహరణ అన్నారు. గతంలో ఐదేళ్లలో తాము 3 లక్షల 32 వేల 671 కోట్ల అప్పు చేస్తే చంద్రబాబు ఈ 12 నెలల కాలంలోనే ఏకంగా లక్షా 37 వేల 564 కోట్ల అప్పు చేశాడన్నారు. ఇది వైసీపీ పాలనతో పోలిస్తే 41 శాతం అదనంగా ఉందన్నారు. ఊరూ పేరులేని ఉర్సా సంస్ధకు విశాఖ(Visakhapatnam)లో రూపాయికి రూ.3 వేల కోట్ల విలువైన భూములు ఇవ్వడం కంటే పెద్ద స్కాం ఉందా అని జగన్ ప్రశ్నించారు. విశాఖలో ఓ మాల్ కట్టడానికి రూ.2వేల కోట్ల విలువైన భూమిని లులూకు ఇవ్వడం కూడా ఇలాంటిదేనన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఇసుక, లిక్కర్, మట్టి మాఫియా చెలరేగిపోతున్నాయన్నారు. లిక్కర్‌ కేసులంటూ తప్పుడు ఆరోపణలతో.. వైసీపీ నేతలతో పాటు అధికారులను వేధిస్తున్నారు అని వైఎస్‌ జగన్‌ అన్నారు.

    More like this

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...