Transfers of ASP's
Transfers of ASP's | తెలంగాణలో భారీగా ఏఎస్పీల బదిలీలు

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Transfers of ASP’s | తెలంగాణలో భారీ సంఖ్యలో అదనపు ఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు హోంశాఖ స్పెషల్​ సెక్రటరీ (Special Secretary of Home Ministry) రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.

ఖమ్మం అదనపు డీసీపీగా ఉన్న నరేశ్​కుమార్​ను జయశంకర్​ భూపాలపల్లి (Jayashankar Bhupalapally) ఏఎస్పీగా(అడ్మిన్​)గా బదిలీ చేశారు. అక్కడ ఉన్న కిషన్​ను వరంగల్​ ఏఎస్పీగా బదిలీ చేశారు. వెయిటింగ్​లో ఉన్న ఉదయ్​ రెడ్డి మాదాపూర్​ (Madapur) అడిషనల్​ డీసీపీగా.. అక్కడ పనిచేస్తున్న జయరాంను టీజీఐసీసీసీ (TGICCC) అదనపు​ ఎస్పీగా నియమించారు. మహమ్మద్​ ఫజుల్​ రహమాన్​ ను అడిషనల్​ డీసీపీ మేడ్చల్​ నుంచి సీఐడీకి బదిలీ చేశారు.​ వెయిటింగ్​ లో ఉన్న విశ్వప్రసాద్ ను అడిషనల్ డీసీపీ(ఎస్​వోటీ మేడ్చల్​ జోన్​)కు బదిలీ చేశారు.

Transfers of ASP’s | నల్గొండ ఏఎస్పీ(అడ్మిన్​)గా గొల్ల రమేశ్​..

వెయిటింగ్​లో గొల్ల రమేశ్​ను నల్గొండ ఏఎస్పీ (అడ్మిన్​)గా బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తున్న రాములునాయక్​ను నిర్మల్​ ఏఎస్పీగా బదిలీ చేశారు. హైదరాబాద్​ సిటీ సీసీఎస్​ అడిషనల్​ డీసీపీగా ఉన్న రవీందర్​రెడ్డిని సూర్యాపేట ఏఎస్పీ అడ్మిన్​గా నియమించారు. అక్కడ కొనసాగుతున్న నాగేశ్వర్​రావును డీజీపీ ఆఫీస్​కు అటాచ్​ చేశారు. వెయిటింగ్​లో ఉన్న చంద్రకాంత్​ను సీఐడీ విభాగానికి ట్రాన్స్​ఫర్​ చేశారు. అక్కడ ఉన్న లక్ష్మిని ఎల్బీ నగర్​ ట్రాఫిక్​ అడిషనల్​ డీసీపీగా ట్రాన్స్​ఫర్​ చేశారు. మహమ్మద్​ అష్వక్​ ను అడిషనల్​ డీసీపీ హైదరాబాద్​ నుంచి అడిషనల్​ డీసీపీ సీటీసీకి బదిలీ చేశారు. సీటీసీలో ఉన్న ఆనంద్​ను సెంట్రల్​ జోన్​కు ట్రాన్స్​ఫర్​ చేశారు.

Transfers of ASP’s | సెంట్రల్​ జోన్​లో పనిచేస్తున్న కృష్ణగౌడ్​ను..

సెంట్రల్​ జోన్​లో పనిచేస్తున్న కృష్ణగౌడ్​ను డీజీపీ ఆఫీస్​కు అటాచ్​ చేశారు. మహబూబ్​నగర్​ (Mahabubnagar) ఏఎస్పీ(అడ్మిన్) రాములును హైదరాబాద్​ ట్రాఫిక్​కు (Hyderabad Traffic) బదిలీ చేశారు. వెయిటింగ్​లో ఉన్న వి.రఘు ఇంటలిజెన్స్​ విభాగానికి (Intelligence Department) ట్రాన్స్​ఫర్​ చేశారు. ఇంటలిజెన్స్​లో ఉన్న గోవర్ధన్​ వెస్ట్​జోన్​ అడిషనల్​ డీసీపీగా నియమించారు. ఆసిఫాబాద్ అదనపు​ ఎస్పీ(అడ్మిన్​) ప్రభాకర్​ రావ్​ను వరంగల్​ కమిషనరేట్​ ఎల్​ఎండ్​వో, ట్రాఫిక్​ అదనపు డీసీపీగా నియమించారు. వెయిటింగ్​లో ఉన్న శ్రీకాంత్​ను సౌత్​, ఈస్ట్​ జోన్​ డీసీపీగా బదిలీ చేశారు.

Transfers of ASP’s | సిద్ధిపేట్​ అడిషనల్​ డీసీపీ(అడ్మిన్​)గా కుషాల్కర్​..

శ్రీనివాస్​రావును విజిలెన్స్​ అండ్​ ఎన్​ఫోర్స్​మెంట్​కు (Vigilance and Enforcement), కుషాల్కర్​ను సిద్ధిపేట్​ అడిషనల్​ డీసీపీ(అడ్మిన్​)గా ట్రాన్స్​ఫర్​ చేశారు. నరేందర్​ను​ భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) అడిషనల్ ఎస్పీగా బదిలీ చేశారు. వెంకట రమణ అడిషనల్​ డీసీపీ (అడ్మిన్​) కరీంనగర్​కు ట్రాన్స్​ఫర్​ చేశారు. పూర్ణచందర్​ శంషాబాద్​ అడిషనల్​ డీసీపీగా నియమితులయ్యారు. శంషాబాద్​ అడిషినల్​ డీసీపీగా ఉన్న రాంకుమార్​ను డీజీపీ ఆఫీస్​కు అటాచ్​ చేశారు. వెయిటింగ్​లో ఉన్న హన్మంత్​ రావును సైబరాబాద్​ ట్రాఫిక్​ అడిషనల్​ డీసీపీగా, కొమ్మెర శ్రీనివాసరావ్​ను రాజేంద్రనగర్​ అడిషనల్​ డీసీపీగా, ఎం సుదర్శన్​ను అడిషనల్​ డీసీపీ సీసీఎస్​, ఈవో డబ్ల్యూకు, శ్యాంప్రసాద్​రావు సీఐడీ అదనపు ఎస్పీగా బదిలీ అయ్యారు. ​