అక్షరటుడే, వెబ్డెస్క్: Samantha | ప్రముఖ తెలుగు హీరోయిన్ సమంత రూతుప్రభు, అమల అక్కినేని ఒకే వేదికపై తళుక్కుమన్నారు. జీ తెలుగు అవార్డుల ప్రదానోత్సవంలో (Zee Telugu Awards ceremony) వారిద్దరు కలిసి పాల్గొనడం చర్చనీయాంశమైంది.
తెలుగు సినీ పరిశ్రమలో 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సమంతను (samantha) జీ తెలుగు అవార్డుతో సత్కరించింది. ఈ కార్యక్రమానికి సమంతతో పాటు అమల కూడా హాజరు కావడం విశేషం. నాగచైతన్యతో (Naga Chaitanya) విడాకుల తర్వాత సమంత ఇప్పటివరకూ అక్కినేని కుటుంబంతో కనిపించలేదు. అయితే, జీ తెలుగు అవార్డుల వేడుకలో మాత్రం మాజీ అత్తాకోడళ్లు కలిసి స్టేజ్ పంచుకోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ షోలో సమంత, నటి అమల అక్కినేనితో (actress Amala Akkineni) వేదికపై కనిపించింది. ఈ కార్యక్రమానికి పుష్ప దర్శకుడు సుకుమార్ (Pushpa director Sukumar), రమ్యకృష్ణ (ramya krishna) సహా ఎంతో మంది నటీనటులు పాల్గొన్నారు.
Samantha | వీడియో వైరల్..
ఈ వేడకల ప్రమోషనల్ వీడియోను (promotional video) తాజాగా విడుదల చేయగా, వైరల్ అవుతోంది. పసుపు రంగు వింటేజ్ చీరలో వేదికపైకి వచ్చిన సమంత.. తన కెరీర్ ఆసాంతం అండగా నిలబడిన తెలుగు ప్రేక్షకుల (Telugu audience) ప్రేమ, మద్దతుకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. సమంత భావోద్వేగ ప్రసంగం చేస్తుండగా, అమల గర్వంగా నవ్వుతూ చప్పట్లు కొడుతూ కనిపించింది. ప్రస్తుతం ఈ ప్రమోషనల్ వీడియో వైరల్ అవుతోంది. ఒకే వేదికపై (stage) మాజీ అత్తాకోడళ్లు కనిపించడంపై ఆన్‌లైన్‌లో చర్చనీయాంశమైంది. ఆ వీడియోపై స్పందించిన ఓ అభిమాని “నాగార్జున భార్య (nagarjuna wife) చప్పట్లు కొడుతోది 😮” అని ప్రతిస్పందించారు. మరొకరు “అమల ఎలా అభినందిస్తుంది ❤” అని రాశారు.