అక్షరటుడే, వెబ్డెస్క్ :Curd | ప్రస్తుత ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్య సంరక్షణ, అందమైన శరీరాకృతి, మంచి ముఖ వర్చస్సు కోరుకోవడం సహజమై పోయింది. అయితే, ఇందుకోసం అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. బ్యూటీపార్లర్ల వెంట పరుగులు పెడుతుంటారు. ఇంట్లోనే రకరకాల ప్రయోగాలు చేస్తారు. అయితే, ఎండాకాలంలో ముఖం నల్లబడుతుంది. ముఖంపై చెమటలతో జిడ్డుగా మారతుంది. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఇంట్లోనే ఉండే పెరుగు(Curd)తో ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. ముఖంపై సహజమైన మెరుపు కావాలంటే పెరుగు ఎంతో ప్రయోజనకారిగా ఉపయోగపడుతుంది. ఖరీదైన చర్మ సంరక్షణ ఉత్పత్తుల నుంచి కాకుండా కాదు, పెరుగు వంటి సహజ వస్తువుల నుండి సహజమైన మెరుపు వస్తుంది. పెరుగు వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
Curd | ఎలా ఉపయోగపడుతుందంటే..
మీ ఫ్రిజ్లో ఉంచిన పెరుగు చాలా ప్రత్యేకమైనది ప్రయోజనకరమైన దానిని సరైన మార్గంలో ఉపయోగించడం వల్ల ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఫ్రిజ్(Fridge)లో ఉంచిన చల్లని పెరుగు ఇతర ప్రయోజనాలతో పాటు ముఖానికి చల్లదనాన్ని అందిస్తుంది. చల్లని పెరుగును రోజుకు రెండు మూడు సార్లు మీ ముఖంపై అప్లై చేస్తే ముఖ చర్మం వేడి నుంచి ఉపశమనం పొందుతుంది. అదే సమయంలో అనేక ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది, వాటిలో మొదటిది ముఖం మెరిసిపోవడం, అలాగే, పొడిబారే సమస్య తగ్గిపోవడం జరుగుతుంది.
Curd | ఎలా అప్లై చేయాలంటే..
ముఖానికి రాసుకునే ముందు పెరుగును కనీసం 20 నిమిషాలు ఫ్రిజ్లో ఉంచాలి. ఆ తర్వాత బయటకు తీయాలి. ముందుగా ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. తడి లేకుండా బాగా తుడిచిన అనంతరం ముఖానికి పెరుగు రాయాలి. ఆపై చేతులతో మెల్లిగా మసాజ్(Massage) చేయండి. కనీసం 10 నిమిషాలు వేళ్లతో ముఖాన్ని బాగా మసాజ్ చేయాలి. ఇలా కనీసం 10 నిమిషాలు పెరుగుతో మీ ముఖాన్ని మసాజ్ చేయాలి. ఆ వెంటనే ముఖం కడగవద్దు. మసాజ్ చేసిన కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత, ముఖాన్ని శుభ్రమైన నీటితో కడిగి, కాటన్ వస్త్రంతో తుడవాలి. ఇలా నాలుగైదు రోజులు చేస్తే నిగారించే అందం మీ సొంతమవుతుంది. అయితే, పెరుగు ఉపయోగించిన తర్వాత, కనీసం 2 గంటల పాటు ఏ ఫేస్ వాష్ లేదా మరే ఇతర చర్మ సంరక్షణ ఉత్పత్తిని ఉపయోగించకూడదు.