అక్షరటుడే, ఇందూరు: Muncipal Corporation | మున్సిపల్ సిబ్బంది బాధ్యతతో పనిచేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ (Municipal Corporation Commissioner) దిలీప్ కుమార్ ఆదేశించారు. గురువారం నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలం నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
మురికి కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, ఇంటింటి చెత్త సేకరణ పక్కాగా జరపాలని సూచించారు. వర్షాకాలంలో వ్యాధులు సంక్రమించకుండా ఉండాలంటే మున్సిపల్ సిబ్బంది బాధ్యతతో పనిచేయాలని స్పష్టం చేశారు. అలాగే ఇంజినీరింగ్ విభాగం (Muncipal Engineering Department) అధికారులు లోతట్టు ప్రాంతాల్లో పర్యటించాలని ఆదేశాలు జారీ చేశారు. కమిషనర్ వెంట మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ (Municipal Health Officer), సానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లు తదితరులు ఉన్నారు.