ePaper
More
    HomeజాతీయంTerrorist Attack | ఉగ్ర‌దాడికి ఐఎస్ఐ కుట్ర‌.. భ‌గ్నం చేసిన నిఘా వ‌ర్గాలు

    Terrorist Attack | ఉగ్ర‌దాడికి ఐఎస్ఐ కుట్ర‌.. భ‌గ్నం చేసిన నిఘా వ‌ర్గాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Terrorist Attack | పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ(ISI) ఇండియాలో ఉగ్ర‌దాడికి చేసిన కుట్ర‌ను మ‌న నిఘా వ‌ర్గాలు భ‌గ్నం చేశాయి. పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధం ఉన్న గూఢచర్య నెట్‌వర్క్‌ను ఛేదించాయి. దేశ రాజధానిని లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాద కుట్రను భగ్నం చేశాయి. మూడు నెలల పాటు జరిగిన ఈ ఆపరేషన్‌(Operation)లో ఇద్దరు కీలక వ్యక్తులను అరెస్టు చేశారు. అందులో ఒక పాకిస్తానీ గూఢచారి కూడా ఉన్నారు.

    Terrorist Attack | ప‌హ‌ల్​గామ్‌కు ముందే..

    పహల్​గామ్‌లో ఉగ్రవాద దాడికి చాలా కాలం ముందు పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ(Pakistan intelligence agency ISI) మరో పెద్ద ఉగ్రవాద దాడికి ప్రణాళిక వేసింది. ఈ మేర‌కు త‌న స్లీప‌ర్ సెల్స్‌ను ఆక్టివేట్ చేసింది. అయితే, ఐఎస్ఐ స్లీపర్ సెల్ నెట్‌వర్క్‌ను కేంద్ర సంస్థలు ఛేదించాయి. దేశంలో పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐతో సంబంధం ఉన్న నెట్‌వర్క్‌ను మ‌న ఏజెన్సీలు గుర్తించాయి. మూడు నెలలుగా కొనసాగిన దర్యాప్తును తాజాగా వెల్ల‌డించాయి. దర్యాప్తులో భాగంగా ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అందులో ఒకరు పాకిస్థానీ కాగా, మ‌రొకరు నెపాలీ మూలాలున్న ఆంసరుల్ మియా అన్సారీగా గుర్తించారు. ఇతను పాకిస్థాన్ ఐఎస్ఐ ద్వారా ఇండియాకు వచ్చి భారత సైన్యానికి(Indian Army) సంబంధించిన రహస్య సమాచారాన్ని పాకిస్థాన్‎కు పంపడం కోసం పని చేస్తున్నాడు. మరోవైపు పాకిస్తాన్‌కు చెందిన వ్య‌క్తి కూడా ఇండియాలో తాజాగా కీలక లావాదేవీలతోపాటు అనేక కార్యకలాపాలను పాకిస్థాన్(Pakistan) కోసం చేసేవాడు.

    Terrorist Attack | ర‌హ‌స్యాల చేర‌వేత‌..

    అన్సారీ(Ansari) ఓ హోటల్‌లో ఉంటూ పాకిస్థాన్ ISI అడిగినట్లు మేర‌కు భారత సైన్యానికి సంబంధించిన పలు రహస్య డాక్యుమెంట్లను సీడీల రూపంలో తయారు చేసి చేరవేయాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలో అన్సారీకి సహకరించిన మరో నిందితుడు అఖ్లఖ్ అజాం(Akhlaq Azam) కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో కేంద్ర సంస్థలు అన్సారీ నుంచి పలు రకాల రహస్య డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నాయి. ఆ డాక్యుమెంట్లు భారత సైన్యానికి సంబంధించిన ర‌హ‌స్య స‌మాచార‌మ‌ని గుర్తించారు.

    Terrorist Attack | ఇండియాపై పాకిస్థాన్ కుట్ర

    ఈ వ్యవహారంలో పాకిస్థాన్ హైకమిషన్ సిబ్బంది(Pakistan High Commission staff)పైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ISI అధికారి ముజమ్మిల్, ఎహ్సాన్-ఉర్-రహీమ్, డానీష్ అనే పేరు కలిగి ఉన్న హైక‌మిష‌న్ సిబ్బంది.. ఇండియాలోని ప్రముఖ యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని తెలిసింది. ఈ అనుమానాలకు సంబంధించిన విషయాలను కేంద్ర దర్యాప్తు సంస్థలు పరిశీలిస్తూనే ఉన్నాయి. దీనివల్ల పాకిస్థాన్ ISI వివిధ నెట్‌వర్క్‌ల ద్వారా భారతదేశంలో తన కార్యకాలపాలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది.

    Latest articles

    India – Russia | “ఈ రోజు.. ఆనాడు”.. ట్రంప్‌కు గ‌ట్టి జ‌వాబిచ్చిన ఆర్మీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : India - Russia | భార‌త్‌, ర‌ష్యా మ‌ధ్య ర‌క్ష‌ణ ఉత్ప‌త్తుల కొనుగోళ్లు, వాణిజ్య...

    Collector Nizamabad | కుర్నాపల్లిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

    అక్షరటుడే, బోధన్: Collector Nizamabad | ఎడపల్లి మండలం కుర్నాపల్లి (Kurnapalli Village) కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector...

    Kubreshwar Dham Stampede | కుబ్రేశ్వర్ ధామ్‌లో తొక్కిసలాట.. ఇద్దరు భక్తుల మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kubreshwar Dham Stampede | మధ్యప్రదేశ్(Madhya Pradesh)​లో విషాదం చోటు చేసుకుంది. సెహోర్‌లోని కుబ్రేశ్వర్...

    India Alliance | సుప్రీం వ్యాఖ్య‌ల‌పై విప‌క్షాల అస‌హ‌నం.. అసాధార‌ణ వ్యాఖ్య‌ల‌ని మండిపాటు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : India Alliance | లోక్‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత రాహుల్‌గాంధీపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య‌ల‌పై ఇండి...

    More like this

    India – Russia | “ఈ రోజు.. ఆనాడు”.. ట్రంప్‌కు గ‌ట్టి జ‌వాబిచ్చిన ఆర్మీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : India - Russia | భార‌త్‌, ర‌ష్యా మ‌ధ్య ర‌క్ష‌ణ ఉత్ప‌త్తుల కొనుగోళ్లు, వాణిజ్య...

    Collector Nizamabad | కుర్నాపల్లిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

    అక్షరటుడే, బోధన్: Collector Nizamabad | ఎడపల్లి మండలం కుర్నాపల్లి (Kurnapalli Village) కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector...

    Kubreshwar Dham Stampede | కుబ్రేశ్వర్ ధామ్‌లో తొక్కిసలాట.. ఇద్దరు భక్తుల మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kubreshwar Dham Stampede | మధ్యప్రదేశ్(Madhya Pradesh)​లో విషాదం చోటు చేసుకుంది. సెహోర్‌లోని కుబ్రేశ్వర్...