అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Donald Trump | అమెరికాలో ముష్కరులు వీరంగం సృష్టించారు. వాషింగ్టన్ డీసీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంలో Israeli Embassy Staff ఇద్దరు సిబ్బందిపై క్యాపిటల్ యూదు మ్యూజియం వెలుపల ఓ వ్యక్తి వచ్చి కాల్పులు జరిపాడు. బుధవారం సాయంత్రం 3వ వీధి, ఎఫ్ వీధి సమీపంలోని క్యాపిటల్ జ్యూయిష్ మ్యూజియం(Capital Jewish Museum) వద్ద ఈ ఘటన జరిగింది. ఈ కాల్పుల ఘటనలో ఇద్దరు ఇజ్రాయెల్ రాయబాక కార్యాలయ సిబ్బంది అక్కడికక్కడే మృతి చెందారు. మ్యూజియంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన సిబ్బందికి అతి సమీపంగా వచ్చిన ముష్కరులు కాల్పులు జరిపారు.
Donald Trump | దారుణం..
ఈ మ్యూజియం ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI వాషింగ్టన్ ఫీల్డ్ ఆఫీస్‌కు కొన్ని అడుగుల దూరంలో ఉండటం విశేషం. ఈ ప్రాంతంలో జ్యూయిష్ సమాజం చరిత్ర, సంస్కృతిని ప్రదర్శించే మ్యూజియం ఉంది. ఆ సమయంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఒక వ్యక్తి ఆయుధంతో వచ్చి దాడి చేసి, ఒక పురుషుడు, ఒక మహిళపై కాల్పులు జరిపాడు. కాల్పుల అనంతరం ఉగ్రవాదులు(Terrorists) ప్రీ పాలస్తీనా నినాదాలు చేశారు. ఈ ఘటనను ఇజ్రాయెల్ యూఎన్ రాయబారి డానీ డానన్(Israeli UN Ambassador Danny Danon) తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వారిపై అమెరికా అధికారులు చర్యలు తీసుకుంటారని అనుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు నివసించే వాషింగ్టన్ డీసీ నగరంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. అలాంటి చోట ఉగ్రదాడి జరగడం తీవ్ర కలకలం రేపుతోంది.
కాల్పులు జరిపిన వ్యక్తిని అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. ఉద్దేశపూర్వంగానే వారిని హతమార్చినట్టు పోలీసులు నిర్ధారణకి వచ్చారు. ఈ ఘటనపై డొనాల్డ్ ట్రంప్ (Donald trump) స్పందించారు. జెవిష్ మ్యూజియం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. బాధిత కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అమెరికాలో ద్వేషానికి, ఉగ్రవాదానికి చోటు లేదని యూదులకి వ్యతిరేఖంగా జరుగుతున్న భయంకరమైన దాడులు, హత్యలు తక్షణమే ఆగాలని హెచ్చరించారు. ఈ ఘటనతో ఇతర దేశాలలోని ఎంబసీలని అప్రమత్తం చేశారు.