అక్షరటుడే, వెబ్డెస్క్ : Pahalgam terror attack | పహల్గామ్ ఉగ్రదాడి Pahalgam terror attack నేపథ్యంలో పాకిస్థాన్ pakistan కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. సరిహద్దు boarder వెంబడి భారీగా సైన్యాన్ని army మొహరిస్తోంది. కశ్మీర్ kashmir సరిహద్దుకు యుద్ధ విమానాలు fighter jets తరలించింది. కరాచీ నుంచి లాహోర్, రావల్పిండికి యుద్ధ విమానాలు బయలుదేరాయి. పాక్ చర్యలను భారత్ గమనిస్తోంది. ఇప్పటికే ఉగ్రదాడిపై ఆగ్రహంతో ఉన్న భారత్ ఎలాంటి చర్యలు చేపడుతుందోననే భయంతో పాక్ బలగాలను మోహరిస్తున్నట్లు సమాచారం.
Pahalgam terror attack | ఉగ్రదాడిని ఖండించిన దాయాది దేశం
ఓ వైపు ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ భారత్ Bharat పై దాడులు చేయిస్తున్న దాయాది దేశం.. మరోవైపు ఆ ఘటనను ఖండించడం గమనార్హం. మరణించిన వారి కుటుంబాలకు పాక్ Pakistan సానుభూతి తెలిపింది. కాగా దాడికి పాల్పడింది తామేనని లష్కరే తోయిబా అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ TRF ప్రకటించింది.
Pahalgam terror attack | పాక్ వెళ్లి వచ్చి దాడి..
పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను అధికారులు గుర్తించారు. దాడికి పాల్పడిన వారిలో ఇద్దరు కాశ్మీరీలుగా అనుమానిస్తున్నారు. వారు 2018లో పాక్కు వెళ్లి ఇటీవలే మరో నలుగురితో కాశ్మీర్లోకి చొరబడ్డట్లు అనుమానిస్తున్నారు. అక్కడే దాడికి ప్రణాళిక రచించి మద్దతుదారుల నుంచి ఆయుధాలు సేకరించి దాడులు చేసినట్లు భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి.