అక్షరటుడే, వెబ్డెస్క్: Traffic Fines | వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు తనిఖీలు చేపడుతారు. నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానా వేస్తారు.
బైక్లు, కార్లు (bikes and cars) తదితర అన్ని వాహనాలు రూల్స్ (vehicle rules) పాటించకపోతే ఫైన్లు వేస్తారు. అయినా చాలా మంది ట్రాఫిక్ రూల్స్ పాటించరు. ప్రజల భద్రత కోసమే ప్రభుత్వం ట్రాఫిక్ నిబంధనలు అమలు చేస్తున్నా.. చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. హెల్మెట్ (helmet) ధరించకుండా బైక్లు నడుపుతారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా పోలీసులు భారీగా జరిమానాలు వేశారు.
కార్స్ 24 నివేదిక ప్రకారం.. 2024 సంవత్సరంలో దేశవ్యాప్తంగా ట్రాఫిక్ రూల్స్ (traffic rules) పాటించని వాహనదారులకు అధికారులు రూ.12 వేల కోట్ల ఫైన్ వేశారు. కాగా ఇందులో కేవలం రూ.మూడు వేల కోట్ల జరిమానాలు మాత్రమే చెల్లించారు. మిగతా రూ.9 వేల కోట్ల ఫైన్లు ఇంకా పెండింగ్లోనే ఉన్నట్లు కార్స్ 24 పేర్కొంది. అయితే తెలంగాణలో (telangana) ఫైన్ల వసూలు అధికారులు అప్పుడప్పుడు స్పెషల్ డ్రైవ్లు (special drives) చేపడతారు. అంతేగాకుండా ప్రభుత్వం (governament) కూడా స్పెషల్ డిస్కౌంట్ ఇస్తుంది.