ePaper
More
    HomeసినిమాHero Vishal | విశాల్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వ‌య‌స్సు ఎంత? ఆమెకి ఉన్న ఆస్తులు...

    Hero Vishal | విశాల్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వ‌య‌స్సు ఎంత? ఆమెకి ఉన్న ఆస్తులు ఎంత‌?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Hero Vishal | కోలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్‌లో విశాల్ (Vishal)ఒక‌రు. ఆయ‌న గ‌తంలో ఓ అమ్మాయితో నిశ్చితార్థం జ‌రుపుకొని అనుకోని కార‌ణాల వ‌ల‌న దానిని క్యాన్సిల్ చేసుకున్నాడు. ఇక కొన్నాళ్లుగా సింగిల్‌గా ఉంటున్న విశాల్ రీసెంట్‌గా త‌న పెళ్లికి సంబంధించిన ఆస‌క్తిక‌ర విష‌యాన్ని పంచుకున్నాడు. కబాలి ఫేమ్ సాయి ధన్షిక(Sai Dhanshika)ను వివాహం చేసుకోబోతున్న‌ట్టు ఓ ఈవెంట్‌లో ప్రకటించారు. ఈ క్రమంలో అసలు సాయి ధన్షిక ఎవరు అనే దానిపై అందరూ తెగ చర్చించుకుంటూ ఉన్నారు. ధన్షిక తమిళ పరిశ్రమలో సుపరిచిత నటి. ఆమె “పేరణ్మై”, “నిల్ గవాణి సెల్లాతే”, “అరవాన్”, “పరదేశి” వంటి చిత్రాలలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా “కబాలి” సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) కూతురుగా నటించి అందరిని ఆకట్టుకుంది.

    Hero Vishal | ఆస్తులు ఎంత‌?

    ధ‌న్షిక(Dhanshika) స్వస్థలం తంజావూరు. ఆమె మాతృభాష తమిళం. అంతేకాదు కబాలి చిత్రంకి గాను.. ధన్సిక ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు, ఉత్తమ సహాయ నటిగా విజయ్ అవార్డును కూడా గెలుచుకుంది. షికారు, దాక్షిని అనే తెలుగు చిత్రాల్లో కూడా ఈ హీరోయిన్.. నటించింది. ఈమె వయస్సు 35 కాగా విశాల్ వయస్సు.. 47.. అంటే వీళ్ళిద్దరి మధ్య దాదాపు 12 సంవత్సరాల తేడా ఉంది. ఇక ఈమె ఆస్తుల విషయానికి వస్తే ఈమెకు కేవలం 10 కోట్లు ఆస్తి మాత్రమే ఉన్నట్టు సమాచారం. BMW M4, Tayato Innova కార్, ఒక బైక్ అలానే మూడు కోట్ల విలువ చేసే ఇల్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ అమ్మాయి తో విశాల్ ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటున్నారు అని తెలియడంతో ప్రస్తుతం అందరూ వ్యక్తం చేస్తున్నారు

    విశాల్(Vishal) విష‌యానికి వ‌స్తే.. తెలుగువాడైన విశాల్.. కోలీవుడ్‌లో స్టార్ హీరో స్థాయికి ఎదిగారు. తనను ఎంతోమంది తొక్కేయాలని చూసినా నిలబడి గెలిచాడు. గతంలో వరలక్ష్మీ శరత్ కుమార్, అభినయ, లక్ష్మీమీనన్, అనీషా రెడ్డి, రీమాసేన్ (Reema sen)తదితర హీరోయిన్లతో విశాల్ ప్రేమలో పడ్డారని కోలీవుడ్ మీడియా కోడై కూసింది. కానీ తాము ఫ్రెండ్స్ మాత్రమేనని, వృత్తిరీత్యా అనుబంధం తప్పించి తమ మధ్య ఎలాంటి రిలేషన్‌ లేదని వీరు పలుమార్లు గాసిప్స్‌ను ఖండించారు. నడిగర్ సంఘం భవనం పూర్తయ్యాకే తాను పెళ్లి చేసుకుంటానని విశాల్ సినీ పెద్దల సమక్షంలో మంగమ్మ శపథం చేశారు. అనుకున్నట్లుగానే ఈ భవన నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15 నాటికి నడిగర్ సంఘం నూతన భవనంలో పాలు పొంగించాలని విశాల్ భావిస్తున్నాడు. ఇది అయిపోగానే ఆగ‌స్ట్ 29న విశాల్ పెళ్లి చేసుకోనున్నాడు.

    Latest articles

    Torrential rain | దంచికొట్టిన వాన.. గంటలో 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు..

    అక్షరటుడే, హైదరాబాద్: torrential rain పగలంతా ఉక్కపోతతో మహానగర metropoli ప్రజలు అల్లాడారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా...

    Critical Minerals | యువతకు గుడ్​ న్యూస్​.. రాష్ట్రానికి రెండు క్రిటికల్​ మినరల్స్ రీసెర్స్ సెంటర్స్ మంజూరు!

    అక్షరటుడే, హైదరాబాద్: Critical Minerals : తెలంగాణ (Telangana) విద్యా పొదిలో మరో రెండు కీలక పరిశోధన కేంద్రాలు...

    Collector Kamareddy | జుక్కల్​ సీహెచ్​సీ సూపరింటెండెంట్​, డ్యూటీ డాక్టర్​కు షోకాజ్​ నోటీసులు

    అక్షరటుడే, నిజాంసాగర్​: Collector Kamareddy | జిల్లాలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల పట్ల కామారెడ్డి కలెక్టర్​ కొరడా జులిపిస్తున్నారు....

    CM Revanth | రాష్ట్రంలో భారీ వర్షాలు.. సీఎం రేవంత్​ కీలక ఆదేశాలు..

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : గ్రేటర్​ హైద‌రాబాద్‌ (Greater Hyderabad) తో పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు...

    More like this