ePaper
More
    HomeతెలంగాణHeavy Rains | రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు

    Heavy Rains | రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Rains | రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వానలు పడుతున్నాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అన్ని జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు(Heavy Rains) కురిశాయి. మెదక్​, వరంగల్, నల్గొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది.

    Heavy Rains | ఉపరితల ఆవర్తనంతో..

    అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి. వాయుగుండంగా మారే అవకాశం ఉండటంతో మరో మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Meteorological Department) అధికారులు తెలిపారు. మరోవైపు ప్రస్తుత వాతావరణ పరిస్థితులు నైరుతి రుతుపవనాలకు అనుకూలంగా ఉన్నాయి. దీంతో రెండు రోజుల్లో రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉంది.

    Heavy Rains | మెదక్​ జిల్లాలో అత్యధిక వర్షపాతం..

    రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం మెదక్ జిల్లా(Medak District)లో నమోదైంది. మెదక్​లో 11.9 సెం.మీ, మూసాయిపేటలో 11.2 సెం.మీ, రాజ్​పల్లి 9.8 సెం.మీ, కొల్చారంలో 8.5 సెం.మీల వర్షపాతం నమోదు అయింది. సిద్దిపేట జిల్లా అంగడికృష్ణాపూర్ లో 8.4, దౌల్తాబాద్ 7.4, గజ్వేల్ లో 7.3, సంగారెడ్డి జిల్లా బీహెచ్ఈఎల్​లో 6, మొగుడంపల్లిలో 5 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. వరంగల్ జిల్లా కల్లెడలో 8.4 సెం.మీ., మంగళవారిపేటలో 7.7, నల్గొండ జిల్లా తిరుమలగిరిలో 7.7, మహబూబాబాద్​జిల్లా కొత్తగూడలో 7.4, వరంగల్​జిల్లా చెన్నారావుపేటలో 6.7, సూర్యాపేట జిల్లా బలరాం తండాలో 6.7, పెద్దపల్లి జిల్లా ఆకెనపల్లిలో 6.6, కామారెడ్డి జిల్లా బొమ్మన్​దేవ్​పల్లిలో 6.3 సెంటీమీటర్ల వర్షం పడింది.

    More like this

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...

    Kammarpalli | ఆదర్శంగా నిలుస్తున్న ఎస్సై అనిల్ రెడ్డి

    అక్షరటుడే, కమ్మర్​పల్లి : Kammarpalli | కమ్మర్​పల్లి ఎస్సై అనిల్ రెడ్డి (SI Anil Reddy) ప్రత్యేకత చాటుకుంటున్నారు....

    Bodhan Traffic Police | బోధన్ ట్రాఫిక్ పోలీసుల సేవలకు హ్యాట్సాఫ్​

    అక్షరటుడే, బోధన్ : Bodhan Traffic Police | బోధన్ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు (traffic police) చేపడుతున్న...