ePaper
More
    HomeతెలంగాణHyderabad | ఒంటరి వృద్ధులపై వలపు వల.. పెళ్లి చేసుకుంటామని టోకరా

    Hyderabad | ఒంటరి వృద్ధులపై వలపు వల.. పెళ్లి చేసుకుంటామని టోకరా

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | పెళ్లిళ్ల పేరిట ఒంటరి వృద్ధులను మోసం చేస్తున్న ఇద్దరు కిలేడీలను పోలీసులు (police) అరెస్ట్​ చేశారు. తాము ఒంటరిగా ఉన్నామని, వయసుతో సంబంధం లేకుండా తమను బాగా చూసుకునే వారు కావాలని మ్యారేజీ బ్యూరో (marriage bureau) ద్వారా ఇద్దరు మహిళలు ప్రకటలను ఇచ్చేవారు. ధనవంతులైన వృద్ధులతో పరిచయం పెంచుకొని డబ్బులు కాజేసేవారు. దిల్‌సుఖ్‌నగర్‌లో (Dilsukhnagar) నివాసం ఉంటున్న ఇద్దరు మహిళలు పెళ్లిళ్ల పేరిట చేస్తున్న మోసాన్ని పోలీసులు రట్టు చేశారు. ఏపీలోని తిరువూరుకు చెందిన తాయారమ్మ అలియాస్‌ సరస్వతి భర్త ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారిగా చేశాడు. ఉద్యోగ విరమణకు ముందు సస్పెండ్‌ కావడంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. ఖమ్మం జిల్లా (Khammam district) కొత్తగూడెంకు చెందిన స్వాతికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే స్వాతి, సరస్వతి ఇద్దరు దిల్​సుఖ్​నగర్​లోని ఒకే కాలనీలో నివాసం ఉండేవారు. దీంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.

    Hyderabad | సులభంగా డబ్బు సంపాదించాలని..

    ఆర్థిక ఇబ్బందులతో (financial difficulties) ఉన్న స్వాతి, సరస్వతి సులభంగా డబ్బు సంపాదించడానికి ప్లాన్​ వేశారు. పెళ్లిళ్ల పేరిట వృద్ధులను మోసం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు 2019లో నకిలీ మ్యారేజ్​ బ్యూరోను కూడా ఏర్పాటు చేశారు. అనంతరం ఇద్దరిలో ఒకరి ఫోటో పెట్టి భర్త లేడు, బాగా చూసుకుంటే చాలు అని మ్యారేజ్ బ్యూరోలో (marriage bureau) ప్రకటన ఇచ్చేవారు. వయసుతో సంబంధం లేదని పేర్కొన్నారు. దీంతో ఒంటరిగా ఉంటున్న పలువురు వృద్ధులు వీరి మాయలో పడి మోసపోయారు.

    Hyderabad | పెళ్లి ఖర్చుల పేరిట

    వీరి మాటలు నమ్మి ఏవరైనా ఫోన్​ చేస్తే పెళ్లి (marriage) చేసుకుందామిన చెప్పేవారు. డబ్బున్న వృద్ధులే లక్ష్యంగా వీరు మోసాలకు పాల్పడేవారు. వారితో షాపింగ్​ పేరిట బంగారం, దుస్తులు (gold and clothes) కొనుగోలు చేయించేవారు. అంతేగాకుండా పెళ్లి ఖర్చుల కోసమని డబ్బులు వసూలు చేసి పరారు అయ్యేవారు.

    Hyderabad | ఇలా చిక్కారు..

    ఈ కిలేడీలో చేతిలో దాదాపు వంద మంది వరకు మోసపోయినట్లు సమాచారం. ఓ విశ్రాంత ఉద్యోగి (retired employee) వీరి ప్రకటనకు ఆకర్షితుడై ఫోన్​ చేశాడు. ఇద్దరిలో ఒకరు పెళ్లి కూతురులా, మరొకరు బ్రోకర్​లా నటించారు. అనంతరం పార్క్​లో కలుసుకున్నారు. అనంతరం ఆభరణాలు, చీరలు (jewellery and sarees), కుటుంబ అవసరాలంటూ దఫాలవారీగా రూ.14 లక్షలు బ్యాంకు ఖాతాల్లోకి వేయించుకొని ముఖం చాటేశారు. పెళ్లి గురించి ఆయన అడగ్గా.. వేదిస్తున్నాడని కేసు పెడతామని బెదిరించారు. దీంతో ఆయన మౌనంగా ఉండిపోయారు. ఇలా చాలా మంది పరువు పోతుందని ఫిర్యాదు చేయలేదు. అయితే ఖమ్మం జిల్లాకు (Khammam district) చెందిన ఓ వృద్ధుడి (80)ని ఇదేతరహాలో మోసం చేశారు. రూ.1.77 లక్షల విలువైన వస్తువులు కొనుగోలు చేసి పరారయ్యారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు (police complained) చేయడంతో కేసు నమోదు చేశారు.

    More like this

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...

    Kammarpalli | ఆదర్శంగా నిలుస్తున్న ఎస్సై అనిల్ రెడ్డి

    అక్షరటుడే, కమ్మర్​పల్లి : Kammarpalli | కమ్మర్​పల్లి ఎస్సై అనిల్ రెడ్డి (SI Anil Reddy) ప్రత్యేకత చాటుకుంటున్నారు....

    Bodhan Traffic Police | బోధన్ ట్రాఫిక్ పోలీసుల సేవలకు హ్యాట్సాఫ్​

    అక్షరటుడే, బోధన్ : Bodhan Traffic Police | బోధన్ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు (traffic police) చేపడుతున్న...