Sindoor street
Sindoor street | ఆ కాలనీ పేరు ‘సింధూర్​ వీధి’..

అక్షరటుడే, కామారెడ్డి: Sindoor street | ఉగ్రవాదంపై కేంద్ర బలగాలు చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ పేరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.

పహల్గామ్​లో (Pahalgam Terror Attack) పర్యాటకులపై జరిగిన దాడికి పాకిస్తాన్​కు (Pakistan) భారత్​ ధీటైన జవాబు ఇచ్చింది. పాకిస్తాన్​లోని (Pakistan​) ఉగ్రవాద శిబిరాలపై భారత్​ నేరుగా దాడులు చేసి 100కు పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. దీంతో దేశవ్యాప్తంగా ‘ఆపరేషన్​ సింధూర్​’ (Operation Sindoor) పేరు మారుమోగుతోంది.

ప్రస్తుతం కామారెడ్డి పట్టణంలోని(Kamareddy) ఓ కాలనీకి ‘సింధూర్​ వీధి’ (Sindoor Street) పేరు పెట్టి తమ దేశభక్తిని చాటుకున్నారు. భారత సైనికులు చూపిన తెగువను స్ఫూర్తిగా తీసుకుని జీవితాంతం వారి సాహసాన్ని గుర్తించుకునేలా తమ కాలనీకి ‘సింధూర్​ వీధి’ అని పేరు పెట్టుకున్నామని కాలనీవాసులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ కాలనీ పేరు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.