అక్షరటుడే, వెబ్‌డెస్క్: Palamuru Ranga Reddy | పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్‌పై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (suprem court) కొట్టివేసింది. ఈ ప్రాజెక్టు పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం (state governament) భారీ అవినీతికి పాల్పడిందని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ నాగం జనార్దన్‌రెడ్డి 2019 మార్చిలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్‌ను విచారించిన జస్టిస్ బీవీ నాగరత్న (Justice B.V. Nagaratna) ఆరోపణలు తప్పా ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. ఈ ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి లేదని సెంట్రల్ విజిలెన్స్ కమిటీ (సీవీసీ) తేల్చి చెప్పిందని, సీబీఐ దర్యాప్తుకు ఆదేశించడం కుదరదని తేల్చి చెప్పింది. ఇదే అంశంపై పిటిషనర్ అనేక పిల్లు దాఖలు చేశారని గుర్తు చేసింది. హైకోర్టు అన్నిటిని కొట్టిసిందని, హైకోర్టు తీర్పులో తాము జోక్యం చేసుకోమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌కు అర్హత లేదని పేర్కొంటూ కోర్టు కొట్టివేసింది.
Palamuru Ranga Reddy | ‘పాలమూరు రంగారెడ్డి’ పై పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు
Published on
