ePaper
More
    HomeతెలంగాణNew Pensions | వారికి గుడ్​న్యూస్​.. త్వరలో కొత్త పింఛన్లు

    New Pensions | వారికి గుడ్​న్యూస్​.. త్వరలో కొత్త పింఛన్లు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: New Pensions | పెన్షన్​ pensions కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్​ న్యూస్ చెప్పింది. కొత్త పెన్షన్ల జారీకి చర్యలు చేపట్టింది. ఈ మేరకు కసరత్తు మొదలు పెట్టింది.

    రాష్ట్రంలో కొన్నేళ్లుగా కొత్త పెన్షన్లు New Pensions మంజూరు చేయడం లేదు. గతంలో బీఆర్​ఎస్​ BRS హయాంలో 57 ఏళ్లు నిండిన వారికి పెన్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరించి ఎన్నికలకు ముందు కొత్తగా పింఛన్లు ఇచ్చారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక కొత్త పెన్షన్ల కోసం ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తులు స్వీకరించింది. దీంతో చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం 5.20 లక్షల దరఖాస్తులు పెండింగ్​లో pending applications ​ ఉన్నాయి. దీంతో కొత్త పెన్షన్ల జారీకి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం government అధికారులను ఆదేశించింది.

    ప్రస్తుతం రాష్ట్రంలో దివ్యాంగులకు నెలకు రూ.4,016, ఇతరులకు రూ.2,016 పింఛన్​ వస్తోంది. అయితే అధికారంలోకి వస్తే పెన్షన్​ రూ.నాలుగు వేలు చేస్తామని కాంగ్రెస్ congress​ హామీ ఇచ్చింది. కానీ ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పెన్షన్ల పెంపు ఉండకపోవచ్చు. అయితే కొత్తగా మాత్రం పెన్షన్ల జారీకి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.

    పెన్షన్​ పొందుతున్న వ్యక్తి మరణిస్తే ప్రస్తుతం ఆయన భార్యకు వితంతు పింఛన్ widow pension​ కోసం మాత్రమే ప్రస్తుతం కొత్తగా దరఖాస్తులు తీసుకుంటున్నారు. అలా దరఖాస్తు చేసుకున్న వారికి రెండు నుంచి మూడు నెలల్లో పింఛన్​ ఇస్తున్నారు. అయితే ఇటీవల ఇలాంటి దరఖాస్తులు కూడా భారీగా పెండింగ్​లో ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వారికి వెంటనే పింఛన్​ వచ్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

    More like this

    Banswada | ఐలమ్మ ధైర్యసాహసాలు చిరస్మరణీయం : పోచారం

    అక్షరటుడే, బాన్సువాడ : Banswada | చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి (MLA Pocharam...

    Nepal | 11 ఏళ్ల బాలిక వ‌ల్ల నేపాల్ ప్ర‌భుత్వం కూలిందా.. ఉద్యమం ఉద్రిక్త‌త‌కి దారి తీయడానికి కార‌ణం ఇదే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal | నేపాల్‌లో జెన్‌ జెడ్‌ యువత ప్రారంభించిన ఉద్యమం ఊహించని రీతిలో ఉద్రిక్తతకు...

    Nara Lokesh | నేపాల్‌లో ఉద్రిక్త వాతావ‌ర‌ణం.. సూపర్ సిక్స్-సూపర్ హిట్ కార్యక్రమాన్నిర‌ద్దు చేసుకున్న నారా లోకేష్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | నేపాల్‌(Nepal)లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య అక్కడ చిక్కుకున్న తెలుగువారిని...