ePaper
More
    Homeభక్తిAyodhya | త్వ‌ర‌లోనే రామ‌మందిర నిర్మాణం పూర్తి.. జూన్ 3 నుంచి ప్రాణ ప్ర‌తిష్ఠాపన ఉత్స‌వాలు

    Ayodhya | త్వ‌ర‌లోనే రామ‌మందిర నిర్మాణం పూర్తి.. జూన్ 3 నుంచి ప్రాణ ప్ర‌తిష్ఠాపన ఉత్స‌వాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Ayodhya | అయోధ్య‌లో రామ‌మందిర నిర్మాణం పూర్తి కావొస్తోంది. జూన్ ఆరంభం నాటికి నిర్మాణ ప‌నులు కొలిక్కి రానున్నాయి. 3వ తేదీ నుంచి ప్రాణ ప్ర‌తిష్ఠ కార్య‌క్ర‌మాన్ని (Prana Pratishtha program) నిర్వ‌హించేందుకు ఆల‌య నిర్వాహ‌కులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం జూన్ 5 నాటికి పూర్తవుతుందని శ్రీ రామ జన్మభూమి (Shri Ram Janmabhoomi) నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. రామ దర్బార్ ‘ప్రాణ ప్రతిష్ఠ’ జూన్ 3 నుంచి 5 వరకు జరుగుతుంద‌ని ఆయన వార్తా సంస్థ PTIకి తెలిపారు. జూన్ 5న జరిగే ఈ పవిత్ర కార్యక్రమానికి ఆధ్యాత్మిక నాయకులను ఆహ్వానిస్తామని మిశ్రా చెప్పారు. అయితే, కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వీఐపీలు లేదా రాజకీయ నాయకులు (political leaders) ఎవరూ ఈ కార్యక్రమంలో పాల్గొనరని వెల్ల‌డించారు. “ఆలయ నిర్మాణం వెనుక ఎటువంటి రాజకీయ ఉద్దేశ్యాలు లేవు. 500 సంవత్సరాలకు పైగా పోరాటం తర్వాత ఈ క్షణం వచ్చింది” అని మిశ్రా అన్నారు.

    Ayodhya | 500 ఏళ్ల సుదీర్ఘ పోరాటం

    అయోధ్య‌లో రామాల‌య (Ram temple) నిర్మాణం కోసం హిందువులు, రామ భ‌క్తులు సుదీర్ఘ పోరాటం చేశారు. 500 ఏళ్లకు త‌ర్వాత న్యాయ పోరాటంలో విజ‌యం సాధించారు. చివ‌ర‌కు సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాల‌తో రామ‌మందిర నిర్మాణం సాధ్య‌మైంది. అయితే, ప్ర‌ధాన ఆల‌యం మాత్ర‌మే పూర్తి కావ‌డంతో బాల‌రాముడిని ప్ర‌తిష్ఠించారు. ప్ర‌స్తుతం రామ‌ద‌ర్బార్ (Ram Darbar) స‌హా మిగ‌తా నిర్మాణాలు పూర్తి కావొస్తుండ‌డంతో, ప్రారంభోత్స‌వానికి ఏర్పాట్లు చేస్తున్నారు. శుద్ధీక‌ర‌ణ, ఆలయంలోని కొత్తగా పూర్తయిన భాగాన్ని వేడుక తర్వాత వారంలోపు ప్రజల సంద‌ర్శ‌న‌కు అనుమ‌తించ‌నున్నారు.

    Ayodhya | అయోధ్యలో ‘భారత్ పథ్’

    ‘రామ్ పథ్’, ‘భక్తి పథ్స‌, ‘జన్మభూమి పథ్’ అభివృద్ధి తర్వాత అయోధ్యలో 20 కి.మీ. పొడవైన కొత్త ‘భారత్ పథ్’ త్వరలో నిర్మిస్తున్నారు. రూ.900 కోట్ల అంచనా వేసిన ఈ ప్రాజెక్టును ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం (Uttar Pradesh Chief Minister Office) ప్రకటించింది. విధి నిర్వహణలో ప్రాణాలను త్యాగం చేసిన ధైర్యవంతులకు నివాళిగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం (Uttar Pradesh government) ‘శౌర్య వనాన్ని’ అభివృద్ధి చేస్తోంది. ‘అటల్ వనాన్ని’, ‘ఏక్తా వనాన్ని’, ‘ఏక‌లవ్య వనాన్ని’ కూడా ఏర్పాటు చేస్తోంది. పట్టణ ప్రాంతాల్లో, వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడంలో సహాయపడడానికి ‘ఆక్సీ వనాన్ని’ సృష్టించనున్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ మార్గదర్శకత్వంలో ‘ఏక్ పెడ్ మా కే నామ్ 2.0’ ప్రచారం త్వరలో ప్రారంభం కానుంది.

    More like this

    Health Tips | వంటింట్లో ఆరోగ్యం .. ఇవి తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Health Tips | జ్ఞాపకశక్తిని పెంపొందించడం, మనస్సును పదునుగా ఉంచేవి ఎన్నో మన వంట...

    September 11 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 11 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగంతేదీ (DATE) – సెప్టెంబరు 11,​ 2025 పంచాంగంశ్రీ విశ్వావసు...

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...