ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిIndiramma houses | నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి

    Indiramma houses | నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Indiramma houses | నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిషలు కృషి చేస్తానని ఎమ్మెల్యే మదన్​మోహన్​రావు (MLA madan mohan rao) అన్నారు. లింగంపేట మండలకేంద్రంలో ఇందిరమ్మ ఇళ్లకు (indiramma houses) బుధవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన పేదలందరికీ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు. ఎన్నడూ లేనివిధంగా లింగంపేటలో రూ.25 కోట్లతో అభివృద్ధి పనులు (development works) చేపట్టినట్లు చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు బుర్ర నారాగౌడ్, ఎంపీడీవో నరేశ్​, ఎంపీవో మళహరి, కార్యదర్శి శ్రావణ్‌ కుమార్, పీసీసీ రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి రఫీయొద్దీన్, మోహిత్, ప్రసాద్‌ గౌడ్, ఎల్లమయ్య, రాజు, తదితరులు పాల్గొన్నారు.

    Indiramma houses | నిజాంసాగర్​ మండలంలో..

    అక్షరటుడే, నిజాంసాగర్‌: Indiramma houses | మండలంలోని మల్లూరు, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో బుధవారం ఇందిరమ్మ ఇళ్లకు కాంగ్రెస్‌ నాయకులు భూమిపూజ చేశారు. పార్టీ మండలాధ్యక్షుడు ఏలే మల్లికార్జున్‌ భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన పేదలందరికీ ఇళ్లు మంజూరవుతాయన్నారు. అనంతరం లబ్ధిదారులకు ప్రొసీడింగ్‌ కాపీలు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు కిష్టారెడ్డి, శేఖర్, శ్రీనివాస్, రాము రాథోడ్, ఎంపీడీవో గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.

    More like this

    PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ...

    Moneylaundering Case | మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు.. అక్ర‌మ ఖ‌నిజం త‌ర‌లింపు కేసులో..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Moneylaundering Case | క‌ర్ణాట‌క‌కు చెందిన మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ బుధ‌వారం...

    Thar SUV | నిమ్మకాయని తొక్కించ‌బోయి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిన కొత్త‌ కారు .. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ యువ‌తి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thar SUV | కొత్త కారు కొనుగోలు చేసిన ఆనందం క్షణాల్లోనే భయానక అనుభవంగా...