అక్షరటుడే, వెబ్‌డెస్క్: ACB Raid | నిత్యం ఏసీబీ దాడులు (acb raids) జరుగుతున్నా అవినీతి అధికారులు భయపడడం లేదు. లంచం(bribe) తీసుకోనిదే పనులు చేయడం లేదు. కొందరైతే లంచం తీసుకోవడం హక్కులా భావిస్తున్నారు. ఇటీవల ఏసీబీ అధికారులు అవినీతి అధికారులపై అనేక కేసులు నమోదు చేస్తున్నా.. వారిలో మార్పు రాకపోవడం గమనార్హం. తాజాగా లంచం తీసుకుంటూ మిషన్ భగీరథ ఏఈఈ ఏసీబీకి (caught by acb) చిక్కాడు.
ACB Raid | రూ.లక్ష లంచం తీసుకుంటూ..
నారాయణపేట (narayanapet) జిల్లా మక్తల్ (maktal) మండలం కాంట్రాక్టర్ గతంలో మిషన్ భగీరథ పనులు పూర్తి చేశాడు. వాటి బిల్లులు రూ.20 లక్షల కోసం రూ.లక్ష లంచం తీసుకుంటూ సూర్యాపేట suryapeta మిషన్ భగీరథ ఏఈఈ (Mission Bhagiratha AEE) ఇస్లావత్ వినోద్ ఏసీబీకి చిక్కాడు. ఆయన మక్తాల్ నుంచి సూర్యాపేటకు ట్రాన్స్ఫర్ అయ్యాడు.
అయినా కూడా ఎం–బుక్‌లో బిల్లులు ఎంటర్ చేయలేదు. ఆ బుక్‌ను తన వద్దే ఉంచుకొని బిల్లుల కోసం లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు (acb officials) వినోద్‌ను బుధవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ACB Raid | మాక్లూర్ మండలంలో జీపీ కార్యదర్శి..
నిజామాబాద్ (nizamabad) జిల్లా మాక్లూర్ (makloor) మండలంలో ఓ పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. గొట్టుముక్కుల పంచాయతీ కార్యదర్శి కట్కం గంగ మోహన్ ఓ వ్యక్తి ఇంటికి నంబర్, ప్లాట్‌కు అసెస్‌మెంట్ నంబర్ కేటాయించడానికి రూ.20 లంచం డిమాండ్ చేశాడు. అంత ఇచ్చుకోలేనని ఆ వ్యక్తి బతిమిలాడటంతో రూ.18 వేలుకు ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో రూ.18 వేల లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు గంగమోహన్‌ను పట్టుకున్నారు.
ACB Raid | భయపడొద్దు.. ఫోన్ చేయండి
ప్రజలు ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా తమకు ఫోన్ చేయాలని సూచించారు. 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే అవినీతి అధికారుల పని చెబుతామని పేర్కొంటున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, ఆ పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు.