అక్షరటుడే, వెబ్‌డెస్క్: Cinema Theaters | థియేటర్ల మూసివేత Closure of theaters నిర్ణయం వాయిదా ఎగ్జిబిటర్లు వెనక్కి తగ్గారు. టాకీస్ బంద్ చేయకుండానే తమ సమస్యలు పరిష్కరించుకోవడానికి ఒకే చెప్పారు. హైదరాబాద్(hyderabad)లోని తెలుగు ఫిలిం ఛాంబర్లో (telugu film chamber) బుధవారం ఉదయం నుంచి చర్చలు జరిగాయి. తమకు రెంట్ విధానంలో కాకుండా షేర్ విధానంలో డబ్బులు చెల్లించాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. లేదంటే జూన్ 1 నుంచి థియేటర్లు మూసి వేస్తామని వారు ప్రకటించారు. దీనిపై ఫిలిం ఛాంబర్లో చర్చించారు.
Cinema Theaters | సమస్యల పరిష్కారానికి కృషి
తెలుగు ఫిలిం ఛాంబర్ ఉదయం 11 గంటలకు తెలుగు రాష్ట్రాలలోని డిస్ట్రిబ్యూటర్స్‌తో (distributors) సమావేశం నిర్వహించింది. ఈ మీటింగ్‌కు 40 మంది డిస్ట్రిబ్యూటర్లు హాజరయ్యారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు తెలుగు ప్రొడ్యూసర్స్‌తో (producers) తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లలో మెజారిటీ సభ్యులు సమ్మె వద్దు, థియేటర్లు రన్ చేస్తూనే సమస్య పరిష్కరించే విధంగా కృషి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గతంలో రెండు మూడు సార్లు ఇలాగే థియేటర్లు బంద్ చేసి నష్టపోయినట్లు సమావేశంలో చర్చించారు. సినిమాలు రన్ చేస్తూనే సమస్య పరిష్కరించే విధంగా కృషి చేయాలని డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు కోరారు.
Cinema Theaters | జనాలు రావడం లేదు..
ఇప్పటికే పైరసీ (piracy), ఐపీఎల్ (ipl), ఓటీటీ (ott) రూపంలో ప్రేక్షకులు థియేటర్లకు రావడం చాలా తగ్గిందని డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు థియేటర్లు బంద్ చేస్తే మరింత నష్టపోతామని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని వాయిదా వేయాలని కోరారు. మే 30 నుంచి వరుస సినిమాలు ఉండడంతో మరింత ఇబ్బంది అవుతుందని, థియేటర్ల మూసివేత కార్యక్రమాన్ని పునరాలోచించుకోవాలని ఎగ్జిబిటర్లను కోరారు. దీంతో థియేటర్ల బంద్ వాయిదా పడింది.
Cinema Theaters | సందడి చేయనున్న సినిమాలు
ఈ నెలాఖరు నుంచి థియేటర్లలో పలు చిత్రాలు సందడి చేయనున్నాయి. ముఖ్యంగా పలు పెద్ద సినిమాలు విడుదల (movies release) కానున్నాయి. ఈ క్రమంలో థియేటర్లు మూసివేస్తే ఇబ్బంది అవుతుందని నిర్మాతలు పేర్కొన్నారు. కాగా మే 30న భైరవం సినిమా విడుదల కానుంది. జూన్ 5న థగ్ లైఫ్, జూన్ 12న హరిహర వీరమల్లు, జూన్ 20న కుబేర, జూన్ 27న కన్నప్ప సినిమాలు విడుదల కానున్నాయి. ఈ సమావేశంలో ఎగ్జిబిటర్ల డిమాండ్ అయిన పర్సంటేజ్ షేర్ విధానంపై మరింత చర్చించి, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనేందుకు కృషి చేయాలని నిర్ణయించారు.