ePaper
More
    HomeజాతీయంKeshava Rao | మావోయిస్ట్​ కీలక నేత హతం.. స్పందిందిన మోదీ, షా

    Keshava Rao | మావోయిస్ట్​ కీలక నేత హతం.. స్పందిందిన మోదీ, షా

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Keshava Rao | ఛత్తీస్​గఢ్​ Chhattisgarhలోని నారాయణపూర్​ Narayanpur జిల్లాలో బుధవారం ఉదయం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎన్​కౌంటర్​ encounter చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 27 మంది మావోయిస్టులను బలగాలు హతమార్చాయి. ఇందులో మావోయిస్టు అగ్రనేత, సీపీఐ మావోయిస్ట్​ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు nambala keshava rao కూడా ఉన్నారు. ఈ ఎన్​కౌంటర్​పై ఎక్స్​ వేదికగా ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్​ షా స్పందించారు. భద్రతా బలగాలను అభినందించారు.

    Keshava Rao | బలగాలను చూసి గర్విస్తున్నాం

    ఛత్తీస్​గఢ్​లో జరిగిన ఎన్​కౌంటర్​పై ప్రధాని మోదీ pm modi ట్వీట్​ చేశారు. ఈ అద్భుతమైన విజయానికి మన బలగాలను చూసి గర్విస్తున్నట్లు ఆయన తెలిపారు. మావోయిజం ముప్పును నిర్మూలించడానికి, ప్రజలకు శాంతి, పురోగతితో కూడిన జీవితాన్ని అందించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

    Keshava Rao | నక్సలిజాన్ని నిర్మూలిస్తాం..

    దేశంలో 2026 మార్చి 31 వరకు నక్సలిజాన్ని నిర్మూలిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్​ షా home minister amit shah మరోసారి తెలిపారు. నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో ఈ ఎన్​కౌంటర్​ ఒక గొప్ప విజయం అని ఆయన అభివర్ణించారు.

    ‘ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌లో జరిగిన ఆపరేషన్‌లో మన భద్రతా దళాలు 27 మంది భయంకరమైన మావోయిస్టులను మట్టుబెట్టాయి. వారిలో సీపీఐ-మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి, నక్సల్ ఉద్యమానికి వెన్నెముక అయిన నంబాల కేశవ్ రావు అలియాస్ బసవరాజు ఉన్నారు. నక్సలిజంపై భారత్ చేసిన మూడు దశాబ్దాల పోరాటంలో ప్రధాన కార్యదర్శి హోదా కలిగిన నాయకుడిని మన దళాలు మట్టుబెట్టడం ఇదే మొదటిసారి‘ అని అమిత్​ షా పోస్ట్​ చేశారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పూర్తయిన తర్వాత 54 మంది నక్సలైట్లను అరెస్టు చేశారని, 84 మంది నక్సలైట్లు లొంగిపోయారని ఆయన వివరించారు.

    More like this

    Sriram Sagar | ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న వరద

    అక్షరటుడే, ఆర్మూర్ : Sriram Sagar | శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్ట్ (SRSP)​లోకి ఎగువ నుంచి ఇన్​ఫ్లో కొనసాగుతోంది....

    Trump backs down | వెనక్కి తగ్గిన ట్రంప్.. ​భారత్​తో మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటన.. స్పందించిన మోదీ ఏమన్నారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump backs down : ఎట్టకేలకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. భారత్‌తో...

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...