ePaper
More
    HomeతెలంగాణTelangana University | తెలుగు భాషకు ప్రాధాన్యం తగ్గించడం సరికాదు

    Telangana University | తెలుగు భాషకు ప్రాధాన్యం తగ్గించడం సరికాదు

    Published on

    అక్షరటుడే, డిచ్‌పల్లి: Telangana University | డిగ్రీ కళాశాలల్లో మూడేళ్లకు ఉన్న తెలుగు భాషను వచ్చే విద్యా సంవత్సరం నుంచి రెండేళ్లకు తగ్గించడాన్ని ఖండిస్తున్నట్లు తెలంగాణ యూనివర్సిటీ తెలుగు శాఖ (TU Telugu Department) అధ్యాపకులు తెలిపారు. తెయూలోని సైన్స్‌అండ్‌ ఆర్ట్స్‌ కళాశాల (College of Science and Arts) సెమినార్‌ హాల్‌లో బుధవారం తెలుగు శాఖ అధ్యాపకుల వార్షిక సదస్సు నిర్వహించారు. హెచ్‌వోడీ సీహెచ్‌ లక్ష్మణ్‌ చక్రవర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు తీర్మానాలు చేసి ఆమోదించారు.

    యూజీసీ నిబంధనల (UGC regulations) మేరకు భాష, సాహిత్యాల్లో పీజీ కోర్సుకు డిగ్రీలో 20 క్రెడిట్లు ఉండాలనే నియమం ఉందన్నారు. తెలుగు​ను కోర్‌ సబ్జెక్ట్​గా దోస్త్‌లో సోషల్‌ సైన్సెస్, కామర్స్‌ కోర్సుల్లో బకెట్‌ సిస్టంలో చేర్చాలని కోరారు. తద్వారా ఆసక్తిగల విద్యార్థులు తెలుగు చదివే అవకాశం కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీన్‌ ప్రొఫెసర్‌ కె.లావణ్య, పి.కనకయ్య, వివిధ కళాశాలల అధ్యాపకులు పాల్గొన్నారు.

    More like this

    Urban Company IPO | అర్బన్ కంపెనీ ఐపీఓకు భారీ రెస్పాన్స్.. గంటల వ్యవధిలోనే ఓవర్ సబ్ స్క్రిప్షన్

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Urban Company IPO | యాప్ ఆధారిత సేవలు అందించే అర్బన్ కంపెనీ ఐపీవోకు...

    Telangana University | తెయూ ఇంజినీరింగ్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తాం

    అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్​ కళాశాలలో విద్యార్థులకు హాస్టల్​ వసతి...

    Bihar | ఎన్నికల ముందర బీహార్‌కు కేంద్రం వరాలు.. రూ.7,600 కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Bihar | త్వరలో ఎన్నికలు జరుగున్న బీహార్ రాష్ట్రంపై కేంద్రం వరాల జల్లు కురిపించింది....