ePaper
More
    HomeజాతీయంSupreme Court | చీప్ ప‌బ్లిసిటీ ట్రిక్స్ ఎందుకు?.. ప్రొఫెస‌ర్ అలీఖాన్‌పై సుప్రీం ఆగ్ర‌హం

    Supreme Court | చీప్ ప‌బ్లిసిటీ ట్రిక్స్ ఎందుకు?.. ప్రొఫెస‌ర్ అలీఖాన్‌పై సుప్రీం ఆగ్ర‌హం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Supreme Court | ఆప‌రేష‌న్ సిందూర్‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసి అరెస్టయిన అశోక విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అలీ ఖాన్ మహ్మదాబాద్‌(Professor Ali Khan Mohammadabad)పై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. చీప్ ప‌బ్లిసిటీ పొంద‌డానికి ప్ర‌య‌త్నించ‌డాన్ని తీవ్రంగా త‌ప్పుబ‌ట్టింది. అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసినప్పటికీ, అలీ ఖాన్ చేసిన ఫేస్‌బుక్ పోస్ట్‌పై అత్యున్నత న్యాయస్థానం మండిపడింది. ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను కుక్క అరుపులు అని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఆప‌రేష‌న్ సిందూర్‌(Operation Sindoor)పై అనుచిత వ్యాఖ్య‌లు చేస్తూ అశోక విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ విభాగాధిపతి అలీఖాన్ మహ్మదాబాద్ పోస్టు చేశారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌పై కేసు న‌మోదు చేసిన హర్యానా పోలీసులు మే 18న ఢిల్లీలో అరెస్టు చేశారు. దీంతో ఆయ‌న త‌న‌పై న‌మోదైన కేసుల‌ను కొట్టివేయ‌డంతో పాటు బెయిల్ ఇవ్వాల‌ని సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్ర‌యించారు. ఆయ‌న పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన న్యాయ‌స్థానం బెయిల్ మంజూరు చేసిన‌ప్ప‌టికీ, విచార‌ణ‌ను మాత్రం ఎదుర్కోవాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది. అదే స‌మ‌యంలో ఇలాంటి చీప్ ప‌బ్లిసిటీ ప్ర‌య‌త్నాలు మానుకోవాల‌ని మందలించింది. పాస్‌పోర్ట్‌ను సోనిపట్‌లోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు సమర్పించాలని ఆదేశించింది. మ‌రోవైపు, మేధావులు, విద్యావంతులు “బాధ్యతా రహిత ప్రకటనలు” చేయవద్దని హెచ్చరించింది.

    Supreme Court | చౌక‌బారు ప్ర‌చారం స‌రికాదు..

    పిటిష‌న‌ర్ త‌ర‌ఫున సీనియ‌ర్ న్యాయ‌వాది కపిల్ సిబల్ వాద‌న‌లు వినిపిస్తూ ఆప‌రేష‌న్ సిందూర్ గురించి అలీఖాన్ చేసిన వ్యాఖ్య‌లు దురుద్దేశ‌పూరితం కావ‌ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్ర‌భుత్వ చ‌ర్య భావ‌ ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ‌ను హ‌రించ‌డ‌మేన‌ని తెలిపారు. సదరు సోషల్ మీడియా పోస్ట్ వెనుక ఎటువంటి నేరపూరిత ఉద్దేశ్యం లేదని వాదించారు. అలీ ఖాన్ అంతర్జాతీయ ప్రయాణం అనుమానాస్పదమైనది కాదని, విద్యాపరమైన స్వభావం కలిగి ఉందని మహ్మదాబాద్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఈ కేసు సుప్రీం కోర్టుకు వెళ్లడంతో ఇవాళ అత్యున్నత న్యాయస్థానం(Supreme Court) తాజా తీర్పుని ప్రకటించింది. “ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉంది. కానీ ఇంత మతతత్వం గురించి మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైందా…? దేశం పెద్ద సవాలును ఎదుర్కొంది. రాక్షసులు అన్ని వైపులా నుంచి వచ్చి మన అమాయకులపై దాడి చేశారు. మనం ఐక్యంగా ఉన్నాం. కానీ ఈ సమయంలో.. ఈ సందర్భంగా చౌకబారు ప్రజాదరణ ఎందుకు పొందాలి?” అంటూ జస్టిస్ కోటిసర్ కాంత్(Justice Kotisar Kant) ప్ర‌శ్నించారు. “ప్రతి ఒక్కరికీ భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కు ఉన్నప్పటికీ, మహ్మదాబాద్ చేసే వ్యాఖ్యలను చట్టాన్ని ఉల్లంఘించే కుక్కల మాటలు అంటారు” అని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. “దేశంలో చాలా విషయాలు జరుగుతున్న సమయంలో, అవమానకరమైన, ఇతరులను అసౌకర్యానికి గురిచేసే ఈ రకమైన పదాలను ఉపయోగించే సందర్భం ఎక్కడ ఉంది. ఆయన ఒక విద్యావేత్త‌. ఆయన మాటలకు కొదవ లేదని చెప్పలేము” అని అది సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రొఫెసర్‌పై దర్యాప్తును నిలిపివేయడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు.. ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందంతో విచార‌ణ జ‌ర‌పాల‌ని ఆదేశంచింది. ఈ మేర‌కు 24 గంటల్లోగా హర్యానా లేదా ఢిల్లీకి చెందని సీనియర్ ఐపీఎస్ అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని అత్యున్నత న్యాయస్థానం హర్యానా డీజీపీ(Haryana DGP)ని ఆదేశించింది. బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చే మహ్మదాబాద్ దర్యాప్తుకు సహకరించాలని ఆదేశించింది.

    More like this

    Health Tips | వంటింట్లో ఆరోగ్యం .. ఇవి తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Health Tips | జ్ఞాపకశక్తిని పెంపొందించడం, మనస్సును పదునుగా ఉంచేవి ఎన్నో మన వంట...

    September 11 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 11 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగంతేదీ (DATE) – సెప్టెంబరు 11,​ 2025 పంచాంగంశ్రీ విశ్వావసు...

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...