ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Elephants | ఏపీకి కర్నాటక కుంకీ ఏనుగులు.. ఎందుకో తెలుసా?

    Elephants | ఏపీకి కర్నాటక కుంకీ ఏనుగులు.. ఎందుకో తెలుసా?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Elephants | ఆంధ్రప్రదేశ్​కు ప్రభుత్వానికి కర్నాటక ప్రభుత్వం కుంకీ ఏనుగులు(Elephants) అప్పగించింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్ deputy cm pawan kalyan ​, కర్నాటక సీఎం సిద్ధరామయ్య cm sidda Ramaiah, డిప్యూటీ సీఎం శివకుమార్​ సమక్షంలో ఏనుగుల అప్పగింతకు సంబంధించిన ఒప్పందం జరిగింది. అనంతరం కర్నాటక ప్రభుత్వం ఐదు ఏనుగులను అప్పగించింది.

    ఏపీ(AP)లోని అటవీ ప్రాంతాలకు సమీపంగా ఉన్న పంట పొలాలను అడవి ఏనుగులు ధ్వంసం చేస్తున్నాయి. ఏనుగుల మూలంగా ఎంతోమంది రైతులు(Farmers) చనిపోయారు. ఏనుగుల నుంచి పంటలను కాపాడుకోవడానికి అటవీ ప్రాంత సమీపంలోని రైతులు అనేక ఇబ్బందులు పడేవారు. ఈ విషయం తన దృష్టికి రావడంతో డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ స్పందించారు.

    Elephants | కర్నాటక ప్రభుత్వంతో చర్చలు

    అడవి ఏనుగులను భయపెట్టడానికి కుంకీ ఏనుగులు తీసుకు రావాలని పవన్(Deputy CM Pawan Kalyan)​ నిర్ణయించారు. ఈ మేరకు బెంగళూరు వెళ్లి కర్నాటక ప్రభుత్వం(Karnataka Government)తో చర్చలు పరిపారు. ఇందులో భాగంగా బుధవారం ఐదు ఏనుగులను ఏపీకి అప్పగించారు. ఏపీకి వచ్చే కుంకీ ఏనుగుల పేర్లు.. రంజని, దేవా, కృష్ణా, అభిమన్యు, మహేంద్ర.

    Elephants | ఏనుగుల రక్షణకు ప్రత్యేక బృందం

    ఏనుగుల అప్పగింత సందర్భంగా పవన్​ కల్యాణ్​ మాట్లాడారు. కుంకీ ఏనుగులు(Elephants) ఇచ్చిన కర్నాటక ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో కుంకీ ఏనుగుల రక్షణకు ప్రత్యేక కేంద్రం చేస్తామన్నారు. ఏపీ, కర్ణాటక మధ్య 9 ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య సహకారం ఇలాగే కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...