IPL 2025 Season
IPL 2025 Season | బీసీసీఐకి కేకేఆర్ లేఖ‌.. ఇలాంటివి ఐపీఎల్‌కి మంచిది కాదు..!

అక్షరటుడే, వెబ్​డెస్క్ :IPL 2025 Season | ఐపీఎల్ 2025 లో BCCI కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్‌లో ఉండే అదనపు సమయాన్ని మరో గంట పొడిగించనున్నట్లు ప్రకటన చేసింది BCCI. ఇది వరకు 60 నిమిషాలు అదనపు సమయం ఉండగా.. 20వ తేదీ నుంచి ఆ సమయాన్ని 120 నిమిషాలకు పొడిగించారు. ఇకపై జరిగే అన్ని మ్యాచులకు ఈ నియమం అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది BCCI. ప్రస్తుతం వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. మ్యాచ్ వేళ‌ల పొడిగింపు విష‌యంలో క్లాజ్ 13.7.3 ప్ర‌కారం ఈ మార్పులు చేసిన‌ట్టు స్ప‌ష్టం చేసింది. దాంతో, వ‌ర్షం కార‌ణంగా టాస్ ఆల‌స్య‌మైనా ఈ రెండు గంట‌ల అద‌న‌పు స‌మ‌యం క‌లిసి వ‌స్తుంద‌ని ఫ్రాంచైజీలు సంతోషం వ్య‌క్తం చేస్తున్నాయి.

IPL 2025 Season | కేకేఆర్ సీరియ‌స్..

ప్లే ఆఫ్స్‌ను Play offs దృష్టిలో పెట్టుకొని మ‌రో 60 నిమిషాల్ని చేరుస్తున్నాం అని బీసీసీఐ అన్నారు. ఒక‌వేళ మ్యాచ్ ఆల‌స్యంగా ప్రారంభమైనా ఈ 120 నిమిషాలు ఆట ర‌ద్దు కాకుండా చూసేందుకు ఉప‌యోగ‌ప‌డుతాయి. మే 17న ఆర్సీబీ(RCB), కోల్‌క‌తా(Kolkata)మ్యాచ్ వ‌ర్షార్ఫ‌ణం అయింది. త‌దుప‌రి మ్యాచ్‌ల‌కు వ‌ర్ష సూచ‌న ఉన్నందున ఐపీఎల్ కార్య‌నిర్వాహ‌క మండ‌లి ఈ నిర్ణ‌యం తీసుకున్నాం. మే 20 నుంచి ఈ కొత్త నిబంధ‌న అమ‌ల్లోకి రానుంది’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. మంగ‌ళ‌వారం చెన్నై సూప‌ర్ కింగ్స్(Chennai Super Kings), రాజ‌స్థాన్ రాయ‌ల్స్(Rajasthan Royals) మ్యాచ్‌తో ఎక్స్ ట్రా గంట అందుబాటులోకి వ‌చ్చింది.

అయితే సీజ‌న్ మ‌ధ్య‌లో తీసుకున్న జ‌రిగిన మార్పుపై కేకేఆర్(KKR) అసంతృప్తి వ్య‌క్తం చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టుతో మే 17న వర్షం కారణంగా రద్దయిన విష‌యం తెలిసిందే. ఆర్సీబీ(RCB)తో జ‌రిగిన మ్యాచ్‌ వ‌ర్షం వ‌ల‌న ర‌ద్దు కాగా, దాని వ‌ల‌న కేకేఆర్‌కి చాలా మూల్యం చెల్లించుకుంది. ఇప్ప‌టి రూల్ ఇంత‌కుముందే ప్ర‌వేశ పెట్టి ఉంటే కేకేఆర్‌కి క‌లిసి వ‌చ్చేది. మ్యాచ్ క్యాన్సిల్ కావ‌డం వ‌ల‌న కేకేఆర్ KKr ప్లేఆఫ్స్‌కి వెళ్లే ఛాన్స్ కోల్పోయింది. ముందే పెట్టి ఉంటే క‌నీసం ఐదు ఓవ‌ర్లు అయిన ఆడే ఛాన్స్ ఉండేది. అప్పుడు కొంత క‌లిసి వ‌చ్చేదని కేకేఆర్ అంటుంది. ఇలాంటి రూల్స్ మధ్య‌లోకి తేవ‌డం ఐపీఎల్‌(IPL)కి మంచిది కాదు అని అన్నారు.