అక్షరటుడే, వెబ్డెస్క్ :Flight | శంషాబాద్ ఎయిర్పోర్టు(Shamshabad Airport)లో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. ఎయిర్‌పోర్ట్ నుంచి ఫ్రాంక్ఫోర్ట్ వెళ్లాల్సిన లుఫ్థాన్సా ఎయిర్‌లైన్స్ విమానం(Lufthansa Airlines plane)లో సాంకేతిక లోపం తలెత్తింది. రన్ వేపైకి వెళ్లిన విమానం ముందు టైరులో సమస్య ఉన్నట్లు పైలెట్(Pilot) గుర్తించాడు. వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. విమానంలో ఉన్న 190 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు.
