అక్షరటుడే, బాన్సువాడ: Banswada | మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ (Former Prime Minister Rajiv Gandhi) దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజు (Agro Industries Chairman Kasula Balaraju) అన్నారు. రాజీవ్ గాంధీ వర్ధoతి (Rajiv Gandhi’s death anniversary) సందర్భంగా పట్టణంలోని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు ఖలేఖ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అసద్, జిల్లా యువజన అధ్యక్షుడు మధుసుధన్ రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు కృష్ణరెడ్డి, నార్ల సురేష్, రవీందర్, అఫ్రోజ్, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.