అక్షరటుడే ఇందల్వాయి: Indalwai | మండలవ్యాప్తంగా బుధవారం తెల్లవారుజామున కురిసిన భారీవర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. సిర్నపల్లి వాగు (Sirnapalli) ఉదయం నుంచి పారుతోందని గ్రామస్థులు తెలిపారు. ఈసారి మేనెలలో భారీ వర్షాలు కురుస్తుండడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం సీజన్ కోసం రైతులు పంట పొలాలను సిద్ధం చేసుకుంటున్నట్లు వివరించారు.
