అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Siamese Kher | ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో కమిట్‌మెంట్, కాస్టింగ్ కౌచ్‌లు (Casting couch) తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. హీరోయిన్లని డైరెక్టర్లు, నిర్మాతలు, హీరోలు కమిట్‌మెంట్(Commitment) అడుగుతారని, సినిమా ఒప్పుకునే ముందే అగ్రిమెంట్ కూడా తీసుకుంటారని కొందరు భామలు మీడియా ముందుకు వచ్చి ఓపెన్‌గా చెప్పేస్తున్నారు. తాజాగా తాజాగా హీరోయిన్ సయామీ ఖేర్ క్యాస్టింగ్ కౌచ్‌పై స్పందించింది. నాగార్జున(Nagarjuna)తో వైల్డ్ డాగ్ చిత్రంలో నటించిన హీరోయిన్ సయామీ ఖేర్ తెలుగు దర్శకుడిపై సంచలన కామెంట్స్ చేయడం చర్చనీయాంశం అయింది.
Siamese Kher | మహిళ అయి ఉండి..
సయామీ ఖేర్ (saiyami kher) ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కెరీర్ ప్రారంభంలో తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని గుర్తుచేసుకుంది. “నాకు వచ్చిన అన్ని ఆఫర్ల విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని అని భావిస్తాను. కానీ నాకు 19 – 20 సంవత్సరాల వయసుకున్నప్పుడు ఒక తెలుగు సినిమా ఆఫర్ వచ్చింది. ఒక లేడీ ఏజెంట్ నన్ను పిలిచి ‘మీకు తెలుసా, మీరు ఇక్కడ కాంప్రమైజ్ అవ్వాలి ఉంటుంది’ అని అనడంతో షాక్ అయ్యాను. ఒక మహిళ మరొక మహిళతో ఇలా చెబుతుందని అనుకోలేదు. అలాంటి ఆఫర్ తనకు అవసరం లేదని మొహం మీదే చెప్పేసి ఆ మూవీ ఆఫర్‌ని తిరస్కరించినట్టు వెల్లడించింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ టాలీవుడ్(Tollywood) లో దుమారం రేపుతున్నాయి.
అయితే ఏజెంట్ మాటలకు తాను మొదట అర్థం కానట్లు నటించానని, కానీ ఆమె పదేపదే అదే విషయం ప్రస్తావించడంతో, “క్షమించండి, మీరు నన్ను ఆ మార్గంలో వెళ్లమని సూచిస్తున్నారని అనుకుంటున్నాను. కానీ నాకు కొన్ని పరిమితులు ఉన్నాయి, వాటిని నేను ఎప్పటికీ దాటను అని మొహం మీదే చెప్పేసిందట. ఇక సాయి ధరమ్ తేజ్ రేయ్ (REY) సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కి పరిచయం అయ్యింది ముంబయి అమ్మడు సయామీ ఖేర్. తర్వాత 2016లో ‘మిర్జియా’తో హిందీలో అడుగుపెట్టారు. ‘మౌళి’, ‘చోక్డ్’, ‘వైల్డ్ డాగ్’, ‘ఘూమర్’ వంటి చిత్రాలతో పాటు ‘స్పెషల్ ఆప్స్’, ‘ఫాదూ’ వంటి వెబ్ సిరీస్‌లలో కూడా ఆమె నటించి మెప్పించారు. ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు కూడా చేస్తుంది సయామి. మొత్తానికి ఈ అమ్మడు చేసిన కామెంట్స్ ప్రకంపనలు పుట్టిస్తున్నాయి.