ePaper
More
    Homeఅంతర్జాతీయంPakistan | పాకిస్తాన్​కు మరోషాక్​.. డ్యామ్​ల నిర్మాణానికి అఫ్గాన్​ నిర్ణయం!

    Pakistan | పాకిస్తాన్​కు మరోషాక్​.. డ్యామ్​ల నిర్మాణానికి అఫ్గాన్​ నిర్ణయం!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pakistan | ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ pakistan​కు షాక్​ల మీద షాక్​లు తగులుతున్నాయి. పహల్గామ్​ ఉగ్రదాడి pahalgam terror attack తర్వాత భారత్​ పాకిస్తాన్​కు సింధూ నదీ జలాలను sindhu river water ఆపేసిన విషయం తెలిసిందే. తాజాగా అఫ్గానిస్తాన్​ afganistan సైతం పాక్​కు నీరు వెళ్లకుండా అడ్డుకట్ట వేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.

    పహల్గామ్​ ఉగ్రదాడి తర్వాత భారత్​ పాకిస్తాన్​తో వాణిజ్యంతో పాటు పలు ఒప్పందాలను రద్దు చేసుకుంది. పాకిస్తాన్​ సాగు, తాగు నీరుకు ప్రధాన వనరైన సింధూ నది జలాలకు ఆపేసింది. దీంతో పాక్​ నీటి ఎద్దడి ఎదుర్కొంటుంది. తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నామని, సింధూ నది జలాలు విడుదల చేయాలని ఆ దేశం ఇటీవల భారత్​కు లేఖ కూడా రాసింది.

    Pakistan | డ్యామ్​ల నిర్మాణానికి అఫ్గాన్​ చర్యలు

    పాకిస్తాన్‌కు నీటి ప్రవాహాన్ని తగ్గించడానికి ఆనకట్టలు నిర్మించాలని అఫ్గానిస్తాన్​ యోచిస్తోంది. పాకిస్తాన్‌లోకి ప్రవహించే నీటిని నిలుపుకోవడానికి ఆనకట్టలు dam నిర్మించాలని తాలిబాన్ జనరల్ taliban general ముబిన్ కాబూల్ ప్రభుత్వాన్ని కోరినట్లు మీర్ యాబ్ బలోచ్ వెల్లడించారు. కాబూల్ నది kavul riverకి ఉపనది అయిన కునార్ నది kunar river అఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్‌లోకి ప్రవహిస్తోంది.

    ఇది పాక్‌ నీటి అవసరాలను ఎంతగానో తీరుస్తుంది. దీంతో ఈ నదిపై డ్యామ్​ నిర్మించి నీటిని మళ్లించుకోవాలని ఆ దేశం చూస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆర్థిక సంక్షోభం, పేదరికంతో ఇబ్బందులు పడుతున్న పాక్​ రానున్న రోజుల్లో నీటి కొరతతో మరిన్ని కష్టాలు ఎదుర్కోనుంది.

    More like this

    MP Arvind | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన ఎంపీ అర్వింద్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: MP Arvind | ఉపరాష్ట్రపతి (Vice President) ఎన్నికల్లో నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ (MP...

    Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్​ ఘన విజయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో (Vice President Elections) ఎన్డీఏ అభ్యర్థి సీపీ...

    Indira Saura Giri Jala Vikasam | ఇందిర సౌర గిరి జల వికాసం పథకం కింద లబ్ధిదారులను గుర్తించాలి

    అక్షరటుడే, ఇందూరు: Indira Saura Giri Jala Vikasam | ఇందిర సౌర గిరి జలవికాసం పథకం ద్వారా...