అక్షరటుడే, ఆర్మూర్: Teachers Training | ఆలూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు (Government Schools Teachers )మంగళవారం శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ ఐదు రోజుల పాటు శిక్షణ తరగతులు ఉంటాయని, ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
బిచ్కుందలో..

అక్షరటుడే, బిచ్కుంద: మండలంలోని (Bichkunda Mandal) జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు ప్రారంభించారు. తెలుగు, ఆంగ్లం, గణితం, ఈవీఎస్ పాఠ్యాంశాలకు సంబంధించి డిజిటల్ రూపంలో తరగతులు నిర్వహించారు. మద్నూర్ (Madnoor) మండలానికి చెందిన 71మంది, డోంగ్లీ మండలానికి చెందిన 30 మంది ఉపాధ్యాయులు శిక్షణ తరగతులకు హాజరైనట్లు కేంద్రం ఇన్‌ఛార్జి శ్రీనివాస్, సునీల్ తెలిపారు. కార్యక్రమంలో ఆర్పీలు శ్రీధర్, గంగారాజం, దశరథ్, స్వామి, లక్ష్మణ్, అనిత, సాయిలు, మమత, సూర్యకాంత్, యాదవ్ రావు పాల్గొన్నారు.
నిజాంసాగర్‌లో..

అక్షరటుడే,నిజాంసాగర్: ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు మారుతున్న కాలానుగుణంగా నూతన బోధనా పద్ధతులు అవలంభించాలని ఎంఈవో తిరుపతిరెడ్డి, అమర్‌సింగ్ అన్నారు. మంగళవారం నిజాంసాగర్(Nizamsagar), మహమ్మద్ నగర్ (Mahammad nagar) మండలాల ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులకు సులభంగా పాఠాలు అర్థమయ్యేలా బోధించాలన్నారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం వెంకట్ రాంరెడ్డి, జీహెచ్ఎస్ కాంప్లెక్స్ హెచ్ఎం వెంకటేశం, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
బాన్సువాడలో..

అక్షరటుడే, బాన్సువాడ: ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు సులువుగా అర్థమయ్యేలా బోధించాలని ఎంఈవో నాగేశ్వరరావు(Banswada) అన్నారు. మంగళవారం పట్టణంలో నిర్వహించిన ఎస్జీటీ, ఎల్ఎఫ్ఎల్ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొని పలు సూచనలు చేశారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని సూచించారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం వెంకట రమణ, ఎమ్మార్పీలు సంతోష్, సుధాకర్ గౌడ్, ప్రవీణ్ కుమార్, రవి కుమార్, వాజీద్ అలీ, పండరి, రాజశేఖర్ చౌదరి, శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.